తెలంగాణ

బస్ భవన్ ఎదుట ఎఐటియుసి ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాంట్రాక్టు పద్దతిలో నియమితులై, శిక్షణ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ ఎదుట ఎఐటియుసి ధర్నా నిర్వహించింది. ఏఐటియుసి గ్రేటర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఒక వినతి పత్రం సమర్పించింది. ఈ ధర్నాలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ, టిఎస్‌ఆర్టీసీలో మహబూబ్‌నగర్, రంగారెడ్డి రీజియన్‌లలో కాంట్రాక్టు పద్దతిలో డ్రైవర్లను నియమించి, హకీంపేటలోని జోనల్ ట్రైనింగ్ కళాశాలకు శిక్షణ నిమిత్తం పంపించారన్నారు. అయితే శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 400 మంది డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా తమకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరితే సంస్థ రీజియన్ మేనేజర్లు వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను తీసుకుని తమ వద్దే పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. శిక్షణ పూర్తి చేసిన డ్రైవర్లకు డ్యూటీలు కేటాయించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే శిక్షణ పూర్తి చేసుకున్న డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని, లేనిపక్షంలో ఏఐటియుసి తరఫున ప్రత్యేక కార్యాచరణకు దిగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ఆర్ శ్రీనివాస్‌గౌడ్, కె గోపి, ఎం సుధాకర్, రాజు, రఫీఖ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఆర్టీసి క్రాస్ రోడ్డులోని బస్ భవన్ ఎదుట సోమవారం ఎఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్న దృశ్యం