తెలంగాణ

హైదరాబాద్‌లో కొనసాగుతున్న క్యాబ్‌ల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: హైదరాబాద్‌లో క్యాబ్‌ల బంద్ కొనసాగుతోంది. సోమవారం ఐటీ సెక్టార్, సికిందరాబాద్, హైదరాబాద్‌లలో క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఫైనాన్షియర్ల వేధింపులు అరికట్టాలని, ఓలా, ఉబేర్ లాంటి సంస్థల నిబంధనల పట్ల వారు క్యాబ్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో గచ్చిబౌలి, ఐటీ కారిడార్ పరిధిలో వేలాది క్యాబ్‌లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. క్యాబ్ డ్రైవర్ల ఆందోళనకు మద్దతుగా ఆటో డ్రైవర్లు మద్దతు తెలిపారు. సికిందరాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల ఎదుట ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఓలా, ఉబేర్ సంస్థల నిబంధనలతో తాము జీవనోపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.