తెలంగాణ

పత్తి రైతుల ఆత్మహత్యలు పట్టని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: పత్తిని పండించిన రైతాంగానికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని టిటిడిపి రైతు విభాగం అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఎకరానికి 8 క్వింటాళ్ల పత్తి కూడా దిగుబడి రాకపోవడం, మరో వైపు మద్దతు ధర రాకపోవడంతో ఆత్మహత్యల వైపు రైతులు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. శుక్రవారం ఐదుగురు పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నా సిఎం రైతులకు భరోసా ఇవ్వడం లేదని అన్నారు. శనివారం నాడిక్కడ ప్రతాప్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్వింటాల్ పత్తికి మద్దతు ధర చెల్లించి దానికి రూ.1000 బోనస్‌గా ప్రకటించాలని కోరారు. మొక్కజొన్న క్వింటా రూ.500, అదేవిధంగా క్వింటా వరిధాన్యానికి రూ.500 బోనస్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రూ.1000 కోట్లతో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల వెంటనే ఆపాలని టిటిడిపి ఉపాధ్యక్షుడు ఎం.అమర్‌నాథ్‌బాబు తెరాస ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీరాంసాగర్‌కు నీరివ్వడం అంటే నిజాంసాగర్ ఆయకట్టు రైతుల నోట్లో మట్టికొడుతున్నట్లేనని ఆందోళన వ్యక్తం చేవారు. ఈ పాపంలో మొదటి ముద్దాయి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అని అన్నారు. రబీ రైతులు సింగూరు జలాలపై ఆశలు పెట్టుకుంటే శ్రీరాంసాగర్‌కు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశించడం రైతులను ఆత్మహత్యలవైపు పురిగొల్పే విధంగా ఉందని అన్నారు.

చిత్రం.. వంటేరు ప్రతాప్‌రెడ్డి