తెలంగాణ

తెరాస శ్రేణుల్లో విశ్వాసం నింపేందుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ఎన్నికల సర్వే పేరుతో సిఎం కెసిఆర్ తన శ్రేణుల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. ‘సామాజిక తెలంగాణా-సమగ్రాభివృద్ధి’ అజెండాగా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు కావాలని ఆశాభావం వక్తం చేస్తున్నట్లు సిపిఎం వెల్లడించింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అడుగడుగునా సమర్థిస్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా కంటకంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటుకు కలసి రావాల్సిందిగా వామపక్ష పార్టీలకు, బిజెపి-కాంగ్రెసేతర లౌకిక పక్షాలకు, సామాజిక వేత్తలు, మేధావులు, ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు వెల్లడించింది.