తెలంగాణ

అడవి బిడ్డలపై దాడులు అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 4: అడవి తల్లిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీలపై అటవీ శాఖ అధికారుల దాడులు అప్రజాస్వామికమని ప్రజావిచారణలో వక్తలు పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘ఆదివాసీ అడవి బిడ్డల అటవీ అధికారుల దమనకాండ’పై ప్రజావిచారణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవీందర్ రావు, తిప్పర్తి యాదయ్య పాల్గొని ప్రసంగించారు. అడవి బిడ్డల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం వారిపై దాడులకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల భూపాల్‌పల్లి జిల్లా తడ్వాయి మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న కొత్తి కోయల గుడెంపైకి సుమారు 200 మంది పోలీసులు వెళ్లి వారిపై విచక్షణ రహితంగా దాడులు చేసి నిరాశ్రయులను చేయడం విచారకరమని అన్నారు.
అడవి తల్లిని నమ్ముకొని పోడు వ్యవసాయం చేస్తున్న వారిపై ప్రభుత్వం చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సుమారు 18 ఏళ్ళుగా నివసిస్తున్న గిరిజన జాతులైన లంబాడి, కోయ, చెంచు, గోండు, బోయ, బేతి తదితరుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా వారిపైనే దాడులు చేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ధి, పరిశ్రమలకు అనుమతల పేరిట అడవుల్లో ప్రశాంతంగా జీవిస్తున్న వారి బతుకులను ఆగం చేస్తున్నారని విమర్శించారు.
గిరిజన తండాలు, ప్రజల కోసం ప్రభుత్వాలు చేస్తున్న ఏ ఒక్క చట్టం సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం అమాయకులైన గిరిజనులపై దాడులు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు గిరిజనుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో న్యాయవాది రచనారెడ్డి, త్రినాదరావు, భూ నిర్వాసితులు వెంకటేశ్వర్లు, పాయం బాబురావులు పాల్గొన్నారు.