తెలంగాణ

పోలీసు శాఖలో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/బాలాపూర్/వనస్థలిపురం, నవంబర్ 4: పోలీస్ శాఖలో కాలానికనుగుణంగా మార్పులు జరగాల్సి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మ అన్నారు. శనివారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఆధునీకరించిన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డిజిపి అనురాగ్ శర్మ మాట్లాడుతూ, పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్‌లో భాగంగానే పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామన్నారు. గతంలో తాను సౌత్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న రోజుల్లో ఈ పోలీస్ స్టేషన్‌ను సందర్శించానని, అప్పుడు క్రైమ్ రేటు బాగా ఉండదని గుర్తు చేసుకున్నారు. గతంలో పోల్చితే ఇప్పుడు క్రైమ్ రేటు బాగా తగ్గిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకు తగిన నిధులు కేటాయిస్తూ, అన్నివిధాలా సహకరిస్తుందన్నారు. ఆధునిక ఆయుధాల కొనుగోళ్లు, నూతన పోలీస్ స్టేషన్లు, పాత భవనాల ఆధునీకరించడం, పోలీసుల సంక్షేమానికి పలు పథకాలు చేపట్టడంతో తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశంలోనే ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగిందన్నారు. ఆధునిక టెక్నాలజీ వినియోగంతోనే నేరాలు తగ్గాయన్నారు. తెలంగాణ జిల్లాల ఆవిర్భావం తరువాత మొదటిసారిగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో సబ్సిడీ క్యాంటీన్‌ను ఆయన ప్రారంభించారు. రూ. 16 లక్షల సరుకులతో క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హోంగార్డు నుంచి కమిషనర్ స్థాయి వరకు ఈ సబ్సిడీ క్యాంటీన్‌ను వినియోగించుకోవచ్చన్నారు. అదేవిధంగా ఎల్‌బినగర్ డిసిపి భవనం పై అంతస్తులో నిర్మించిన ట్రాఫిక్ కాంప్లెక్స్‌ను డిజిపి అనురాగ్ శర్మ ప్రారంభించారు.

చిత్రం..పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఆధునీకరించిన భవనాన్ని ప్రారంభిస్తున్న డిజిపి అనురాగ్ శర్మ