తెలంగాణ

కొత్త డిజిపి మహేందర్‌రెడ్డి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. ఈనెల 12న ప్రస్తుత డిజిపి అనురాగ్ శర్మ పదవీ విరమణ చేయనున్నట్టు తెలిసింది. అయితే అదే రోజు కొత్త డిజిపిగా మహేందర్‌రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా ఐపిఎస్ సీనియర్ అధికారుల్లో మహేందర్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైన నేపథ్యంలో..చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వే డిజిగా కొనసాగుతున్న కృష్ణప్రసాద్ పేరు కూడా వినిపిస్తుండగా, ప్రభుత్వం మహేందర్‌రెడ్డి వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. డిజిపి నియామకంతోపాటు పోలీస్ శాఖలోని పలు విభాగాల్లో మార్పులు, చేర్పులు జరుగనున్నట్టు సమాచారం. గత కొంతకాలంగా యూనిఫాంకు దూరంగా ఉండి ఎస్సీ,ఎస్టీ విభాగంలో పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ను మళ్లీ యూనిఫాంలోకి తీసుకువచ్చి పోలీస్ శాఖలో కీలక విభాగం బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. అయితే డిజిపి అనురాగ్ శర్మ పదవీకాలం ఈ నెల 12వ తేదీతో ముగియనున్నందున పోలీస్ శాఖలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.