తెలంగాణ

జలదిగ్బంధంలో ‘ఏడుపాయల దుర్గాదేవి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, నవంబర్ 4: సింగూర్ నుండి నిజాంసాగర్-శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేయడంతో ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. మంజీరా నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పాటు ఘణపురం ప్రాజెక్ట్‌పై నుండి మంజీరా పొం గిపొర్లుతూ పరవళ్లు తొక్కుతోంది. ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం చుట్ట్టూ మం జీరా నీరు చేరడంతో, దుర్గామాత అమ్మవారి ఆలయానికి భక్తులు వెళ్లకుండా ఆల య చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆల య ధర్మకర్తలు, ఆలయ అధికారులు, పోలీసులు భారీ బారికేడ్‌లు ఏర్పాటు చేసి ఆల యం వైపు వెళ్లే రహదారులను మూసివేశారు. వనదుర్గాదేవి అమ్మవారు ఈసారి కార్తీక పూజలు అందుకో లేదు. ఏడుపాయల ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఆలయ అధికారులు పవిత్ర కార్తీక పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఆలయ రాజగోపురంలో దుర్గాదేవి ఉత్సవ విగ్రహాన్ని ప్రతి ష్ఠించి కార్తీక పూజలు జరిపిస్తున్నారు. భక్తు లు రాజగోపురంలో వనదుర్గాదేవిని దర్శించుకునేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశా రు. భక్తులు భక్తిప్రపత్తులతో రాజగోపురం లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహిస్తున్నా రు. ఉద్ధృతంగా మంజీరా పరవళ్లు తొక్కుతున్న దృశ్యాలను భక్తులు తిలకిస్తూ ఆనం దాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజగోపురం ఆవరణలో భక్తులు ప్రమిదలను వెలిగించారు.

చిత్రం..ఆలయంలోకి వచ్చిన మంజీరా నీరు