తెలంగాణ

విక్టోరియా ఆసుపత్రి భూ రికార్డులు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: రాజధానిలోని సరూర్‌నగర్ ప్రాంతంలో విక్టోరియా మెమోరియల్ ఆసుపత్రికి చెందిన భూమి రికార్డులను సమర్పించాలని హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. విక్టోరియా ఆసుత్రికి చెందిన భూమిలో పది ఎకరాలను రాచకొండ పోలీసుకమిషనరేట్‌కు కేటాయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ విఎం హోంఫర్ ఆర్ఫాన్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ బుచ్చిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు విచారిస్తూ పై ఆదేశాలను జారీ చేసింది. ఈ పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ అభినంద్ కుమార్ శివాలితో కూడిన ధర్మాసనం విచారించింది ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్ సత్యం రెడ్డి వాదనలు వినిపిస్తూ, దివంగత ఆరవ నిజాం మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ 1903లో వికోర్టియా మెమోరియల్ హోంను నెలకొల్పారన్నారు. హైదరాబాద్ సంస్థానంలోలోని అనాథ పిల్లలకు ఉచిత విద్య వసతి సదుపాయం నిమిత్తం నిజాం ప్రభువు 73 ఎకరాలను విక్టోరియా ఆసుపత్రికి కేటాయించారన్నారు. ఈ భూమి ట్రస్టు ఆధీనంలో ఉందని, ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు లేవన్నారు. అదనపు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, దేవాదాయ శాఖకు ఈ భూమి లీజుకు సంబంధించిన అధికారాలు ఉన్నాయన్నారు. విఎం హోంలోని విద్యార్ధులకు అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశం మేరకు ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు భూమిని కేటాయించినందు వల్ల ఈ హోంలోని విద్యార్థులకు కలిగే అసౌకర్యంపై అఫిడవిట్‌ను దాఖలు చేయాలని విఎం హోం అధ్యక్షుడిని హైకోర్టు కోరింది. వచ్చే వారానికి ఈ హోంకు సంబంధించిన భూమి రికార్డులను తమ ఎదుట ఉంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూమి రికార్డులను ఎటువంటి పరిస్థితుల్లో మార్చరాదని హైకోర్టు పేర్కొంది.
సలహాదారులకు క్యాబినెట్ ర్యాంకు హోదాపై పిటిషన్
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సలహాదారులకు, ప్రత్యేక ప్రతినిధులకు, వివిధ కార్పోరేషన్ చైర్మన్లకు క్యాబినెట్ హోదాలను కల్పించడాన్ని సవాలు చేస్తూ బిజెపి నేత ఎన్ ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వీరికి క్యాబినెట్ హోదా కల్పించడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని, వివిధ రకాల బిల్లులను చెల్లించాల్సి వస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వై బ బాలజీ మాట్లాడుతూ రాజ్యాంగంలోని అధికరణ 164(1ఏ) కింద క్యాబినెట్ హోదాను ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతం మందికి మాత్రమే కల్పించాల్సి ఉందన్నారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు ప్రతివాదులు కౌంటర్ అఫిడవిట్‌ను మూడు వారాల్లోగా దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇంజనీరింగ్ కాలేజీల కేసు వేరే బెంచికి బదలాయింపు
హైదరాబాద్ నగర పరిసరాల్లో ఇంజనీరింగ్ కాలేజీల్లో జరుగుతున్న ఫ్రాడ్‌పై దర్యాప్తుకు ఆదేశించాలని దాఖలైన పిటిషన్‌ను తాను విచారించనని , ఇతర బెంచి విచారిస్తుందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తు జస్టిస్ రమేష్ రంగనాథన్ ప్రకటించారు. ఈ పిల్‌ను క్వాలిటీ ఫౌండేషన్ సంస్ధ దాఖలు చేసింది. గతంలో తాను కొన్ని కాలేజీల తరఫున వాదనలు చేశానని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసును వేరే బెంచికి బదలాయిస్తే విధంగా పిటిషన్‌ను నమోదు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.