తెలంగాణ

డల్లాస్ తరహాలో హైదరాబాద్ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఉప్పల్, నవంబర్ 7: డల్లాస్ పట్టణం తరహాలో పక్కా ప్రణాళికలతో హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం చైర్మన్ కె.స్వామి గౌడ్ అధ్యక్షతన జరిగిన శాసన మండలి సమావేశంలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అనే అంశంపై అధికార పార్టీ సభ్యులు పూల రవీందర్, కాటేపల్లి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఉప్పల్, కొంపల్లి, ఇతర పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను సత్వరంగా పరిష్కరించాలని కోరగా విపక్ష సభ్యులు ఎండి అలీ షబ్బీర్ మాట్లాడుతూ నగరంలో రోడ్ల వ్యవస్థ అధ్వాన్నంగా ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంత్రి నాయిని స్పందిస్తూ విపక్ష సభ్యుడు అలీ షబ్బీర్‌పై నిప్పులు చెరిగారు. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణను లూటీ చేసిందని, హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించిందని ధ్వజమెత్తారు.
నిర్ణీత గడువులోగానే కంతనపల్లి: హరీశ్‌రావు
ముంపును నివారించంతో పాటు భూసేకరణను తగ్గించేందుకే కంతనపల్లి బ్యారేజీని తుపాలగూడెంకు తరలించామని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు తెలిపారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు బోడకుంటి వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడితే నాలుగు గ్రామాలు పూర్తిగా 13 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయని పేర్కొన్నారు. బ్యారేజీ ప్రదేశాన్ని మార్చడం వల్ల 233 ఎకరాల భూసేకరణ తగ్గిందన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా 38.5 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఉండగా 60 టీఎంసీలకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు.
మానవ సంపద కోసం అప్పులు చేస్తున్నాం: ఈటల
మానవ సంపదను పెంచుకోవడం కోసం అప్పులు చేయడం అనివార్యమని ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఇతర ఆర్ధిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న రుణాల పరిమాణం వివరాలేమిటో చెప్పాలని ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ దేశ, రాష్ట్ర ఆర్ధిక పరిపుష్ఠితో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అవసరమైన రుణాలను కేంద్రం నిబంధనలకు లోబడే తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
బీసీలు అంటే చిన్న చూపా: లలిత
శాసన మండలి సమావేశం చైర్మన్ కె.స్వామి గౌడ్ అధ్యక్షతన జరిగింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ అనే అంశంపై చర్చలో భాగంగా బిజెపి సభ్యులు ఎన్.రాంచందర్‌రావు మాట్లాడుతూ బిజెపి కార్యకర్తల అక్రమ అరెస్టులపై మాట్లాడేందుకు వాయిదా తీర్మానం అఅడిగితే ఇవ్వనందుకు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ప్రత్యేక అంశంపై చర్చలో భాగంగా విపక్ష సభ్యురాలు ఆకుల లలిత మాట్లాడుతూ జనాభాలో యాభై ఎనిమిది శాతం బిసిలు ఉన్నారని, 30శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.