తెలంగాణ

17వరకు శాసనసభ, 22వరకు మండలి సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: శాసనసభ శీతాకాల సమావేశాలను ఈ నెల 17 వరకు, మండలి సమావేశాలను ఈ నెల 22 వరకు కొనసాగించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం వేర్వేరుగా బిఎసిలు సమావేశమై సమావేశాలను ఎప్పటివరకు కొనసాగించాలనే అంశంపై చర్చించాయి. సభలో అనేక బిల్లులు ప్రవేశపెట్టడంతో వాటిపై చర్చించి ఆమోదించడానికి కనీసం ఇంకా పది రోజులు అవసరం అవుతాయని బిఎసి అభిప్రాయపడింది.
అలాగే శాసనసభలో ఆమోదించిన బిల్లులపై మండలిలో కూడా చర్చించాల్సి ఉండటంతో ఈ నెల 22 వరకు కొనసాగించాలని మండలి బిఎసి నిర్ణయించింది. ఈ నెల 17 న తిరిగి బిఎసి నిర్వహించి తదుపరి సమావేశాలను కొనసాగించడమా? ముగించడమా? అనేది నిర్ణయం తీసుకుందామని బిఎసి నిర్ణయించింది. శాసనసభ వ్యవహారాల మంత్రి టి హరీశ్‌రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, జి చిన్నారెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, టిటిడిపి,సిపిఎంల నుంచి సండ్ర వెంకటవీరయ్య, సున్నం రాజయ్య తదితరులు హాజరయ్యారు.