తెలంగాణ

నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. శాసనసభలో బిజెపి సభ్యులు నిల్చుని నిరసన తెలపడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా స్పందించారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని, ఆ క్రమంలో ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. శాసనసభలో తమ గొంతు వినిపించే అవకాశం లేని వారు ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తారని సిఎం అన్నారు. ఛలో అసెంబ్లీ అని వస్తే సిఎం లేదా సంబంధిత శాఖల మంత్రులు లేదా కొన్ని పార్టీల నేతలు కలిసి నిరసన తెలిపి తమ విజ్ఞప్తులను అందించడం ఆనవాయితీ అన్నారు. అవసరమైతే గన్‌పార్కు వద్ద పబ్లిక్ గార్డెన్స్‌లో వారిని కలిసి మాట్లాడేదని తెలిపారు. సమస్యలు ఉంటాయి, వాటికి పరిష్కారాలు ఉంటాయని అన్నారు. పబ్లిసిటీ కోసం రక్కస్ చేయడం సరికాదని సిఎం పేర్కొన్నారు. గతంలో అంగన్‌వాడీ కార్యకర్తలపై లాఠీచార్జీ జరగడం, అప్పటి నుండి ప్రభుత్వాలు నిషేధాజ్ఞలు అమలుచేయడం వస్తోందని అన్నారు. ఎబివిపి, బిజెవైఎం తలపెట్టిన ఛలో అసెంబ్లీ తన దృష్టికి వచ్చిందని అన్నారు. ఉద్యోగ కల్పనపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, బిజెపి సభ్యులు కూర్చుని సభకు సహకరించాలని అన్నారు. శాంతి భద్రతల కోసమే బిజెవైఎం నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని సిఎం కేసిఆర్ పేర్కొన్నారు.
ఉద్యోగావకాశాలు కల్పించండి
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ బిజెపి, బిజెవైఎం తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటోందని శాసనసభలో బిజెపి ఆక్షేపించింది. కె లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులను సృష్టించినా ఛలో అసెంబ్లీని విజయవంతం చేస్తామని నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ఛలో అసెంబ్లీ పిలుపునిస్తే ఎందుకింత వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సాధించుకున్నదే ఉద్యమాల ద్వారా అని ప్రభుత్వం మరిచిపోతోందని అన్నారు. ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేయాలని పేర్కొన్నారు.
మండిపడ్డ కేటీఆర్
శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యేలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంపై ఐటి మంత్రి కెటిఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభలో ప్రశ్న వాయిదా వేసుకుని పారిపోయిన పరిస్థితి బిజెపి సభ్యులదని విమర్శించారు. ఉపాధి కల్పనకు సంబంధించిన చర్చకు బిజెపి నోటీసు ఇచ్చిందని , దానిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఉదయం కిషన్‌రెడ్డి తనకు ఫోన్ చేసి ఇవాళ మొదటి ప్రశ్న తమదేనని, దానిని వాయిదా వేసుకుంటున్నామని చెప్పారని కెటిఆర్ పేర్కొన్నారు. అయితే కిషన్‌రెడ్డి సభకు రావట్లేదేమో అనుకున్నానని, వారు సభకు వచ్చి ప్రశ్నను వాయిదా వేసుకుని ఉద్యోగాల కల్పనపై చర్చ చేపట్టాలని కోరడం సబబుకాదని అన్నారు. హైదరాబాద్‌లో తాగునీటి కొరత చర్చించకుండా, సభలోచర్చకు రాకుండా రచ్చకు రావడం ఏ రకమైన నీతి అని ప్రశ్నించారు. శాసనసభలో బిజెపి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిపై డిప్యుటీ సిఎం మండిపడ్డారు. బిజెపి నిర్ణయానికి కట్టుబడి ఉండకుండా సభ్యులకు, సభకు ఆటంకం కలిగించడం సరికాదన్నారు. సభలో తీరుపై ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ మండిపడ్డారు. ఇలాంటి సభలో తాను కొనసాగలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత గందరగోళం నెలకొన్నా ఒక సభ్యుడు మరో సభ్యుడి మైక్ విరగొడుతున్నా సభా నాయకుడు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని నిరసన వ్యక్తం చేయగా, సిఎం లేచి జోక్యం చేసుకుంటూ బిఎసిలో ఆ అంశాన్ని లేవనెత్తాలని సూచించారు. అయినా అక్బరుద్దీన్ శాంతించలేదు.