తెలంగాణ

భూ రికార్డుల ప్రక్షాళనలో.. నకిలీల గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, నవంబర్ 7: భూరికార్డుల శుద్ధీకరణ కార్యక్రమం దళారుల కంట్లో నలుసుగా మారింది. ఇంతకాలం తాము సాగించిన అక్రమాల తంతు నేడు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో దళారీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరోవైపు ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులే ఒక దశలో నివ్వెరబోతున్నారు. పెద్దఎత్తున నకిలీపాసు పుస్తకాల తంతు వెలుగుచూడడం ఒకవైపు కొనసాగితే మరోవైపు తాము నకిలీలతో నష్టపోయామంటూ గుండెలు బాదుకుంటున్న బాధితులు న్యాయం చేయాలంటూ ఫిర్యాదుల మీద ఫిర్యాదులను అధికారులకు అందజేస్తున్నారు. నకిలీ భూ పట్టాపాసుపుస్తకాలకు అడ్డాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయ.
ఇందులో భాగంగానే అన్నారం గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమంలో పలువురు రైతులు దళారీల చేతుల్లో నష్టపోయామంటూ పేర్కొంటూ న్యాయం కోసం అర్జీలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా అధికారులు నకిలీ పాసు పుస్తకాలలో గ్రహించిన కొన్ని వాస్తవాలు ఇవి. దాదాపు ఏడాదిన్నర క్రితం తెలంగాణ రాష్ట్రం పేరుతో కొత్త పాసుపుస్తకాలు వచ్చాయి. అయితే కొంతమంది బ్రోకర్లు అమాయక రైతులను ఆసరాగా చేసుకొని పెద్దఎత్తున డబ్బులు తీసుకొంటూ అట్టి పాసుపుస్తకాలపై భూములు 2010లోనే పట్టా అయినట్లుగా రికార్డులు తయారు చేశారు. రైతుకు చెందిన భూమి ఖాతాను ఆన్‌లైన్‌లో చూస్తే మరొకరి పేరు కన్పించడం, దీనిని కూడా పరిశీలిస్తే మరొకరి పేరు వెలుగుచూడడం విస్మయాన్ని కలిగిస్తోంది. పట్టా పాసుపుస్తకాలపై వైట్నర్‌తో దిద్ది మరొకరి పేర్లు రాయడం, పట్టాబుక్కులో గతంలో నమోదు చేసిన కాగితానికి మరొక కాగితంతో అంటిపెట్టి కొత్తగా భూవిస్తీర్ణాలను నమోదు చేయడం, ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీలు చేయడం, పాసు పుస్తకంలో నమోదైన భూమి రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అదే రైతు పేరు మీద లేకపోవడం కూడా వెలుగు చూడటంతో మరోమారు మండలంలో నకిలీ పాసు పుస్తకాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
అధికారుల ముందే రైతుల లొల్లి
అన్నారం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ క్యాంపు వద్దే మోసపోయిన అమాయక రైతులు, దళారీలకు మధ్య పెద్దఎత్తున గొడవలు జరుగుతుండడంతో ఒక్కోమారు అక్కడి పరిసరాలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా కొందరు దళారులు రైతుల ఒత్తిడి తట్టుకోలేక తాము తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేయడం చర్చనీయాంశంగా మారింది.
మరొకరు తాము తయారుచేసిన నకిలీ పాసుపుస్తకాన్ని చించివేయడం, కాల్చివేయడం లాంటివి జరగడంతో రెవెన్యూ సిబ్బంది నివ్వెరపోతున్నారు. ముఖ్యంగా తాము మోసపోయామంటూ రైతులు నిత్యం రెవెన్యూ సభకు వచ్చి న్యాయం చేయాలంటూ కోరడం ఆనవాయితీగా కొనసాగుతోంది. కాగా, కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై డిప్యూటీ తహసీల్దార్ పుష్పను వివరణ కోరగా పలు విషయాలు తమ దృష్టికి వచ్చాయని, వాటిని క్షణ్ణంగా పరిశీలన చేస్తున్నట్లు పేర్కొన్నారు.