తెలంగాణ

కాళేశ్వరానికి గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ప్రాజెక్టు నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన స్టేను హైకోర్టు బుధవారం ఎత్తివేసింది. ప్రాజెక్టు విషయంలో మంచినీటి అవసరాలకు ఉద్దేశించిన నిర్మాణాలను ఆపాల్సిన అవసరం లేదంటూ క్లియరెన్స్ ఇచ్చింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ జె ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చిన పిటిషన్ల నేపథ్యంలో, నిర్మాణ పనులు ఆపాలంటూ ఎన్జీటీ స్టే ఇవ్వడం తెలిసిందే. అయితే, ఎన్జీటీ ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తూ, అటవీ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టవద్దని, చెట్లను కూల్చివేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం నుంచి ఎన్జీటీ పర్యావరణ అనుమతులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా సాగునీటికి ఉద్దేశించిన కాల్వలు, పిల్ల కాల్వల నిర్మాణాలు, అనుబంధ నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు ఆదేశాల్లో స్పష్టం చేసింది. నేషనల్
గ్రీన్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే ముందు పరిధికి సంబంధించి అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని హైకోర్టు ప్రస్తావించింది. తాము ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘన జరిగితే వెంటనే ఎన్జీటీ లేదా హైకోర్టు దృష్టికి ఈ అంశాలను తీసుకురావాలని ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన మహ్మద్ హయత్ ఉద్దీన్‌కు హైకోర్టు సూచించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడితే ఎన్జీటీ లేదా హైకోర్టు ఈ కేసును విచారిస్తుంది. ఉల్లంఘనలు జరిగితే మంచినీటి అవసరాలకు ఉద్దేశించిన నిర్మాణాలనూ నిలిపివేయమని ఆదేశిస్తామని హైకోర్టు హెచ్చరిక చేసింది.