తెలంగాణ

మూడు చట్టసవరణ బిల్లులకు ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ శాసన సభ మూడు చట్ట సవరణ బిల్లులను ఆమోదించింది. గురువారం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రవేశపెట్టిన పీడీ యాక్టు పరిధిలోకి వచ్చే దోపిడీ, దొంగతనాలు, డ్రగ్స్ నేరాలు, గూండాల రౌడీయిజం, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, ట్రాఫిక్ అఫెండర్స్, భూ కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించే విధంగా ఉండే ఈ చట్టాన్ని చట్ట సభ అమోదించింది. రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా శాసన సభ ఆమోదించింది. పరిపాలనా సౌలభ్యం కోసం, అభివృద్ధికి తగిన నిధుల సమీకరణకు రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లును శాసన సభ ఆమోదించింది. అదేవిధంగా దుకాణాలు, వాణిజ్య సంస్థల ఏర్పాటుకు సవరించిన బిల్లును హోం, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు చట్ట సభ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లులు దుర్వినియోగం కాకుండా చూడాలని సభలో ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.