తెలంగాణ

లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లకు టెండర్లు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఒక్క హైదరాబాద్ నగరంలో ప్రతిపాదించిన లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు వెల్లడించారు. గురువారం ఆయన జలమండలి కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెండర్లు పూర్తయిన మొత్తం ఇళ్లను నిర్దేశిత లక్ష్యంతో ఏడాదిలోగా నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకు పక్కా ప్రణాళికలతో పని చేయాలని అధికారులను ఆదేవించారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పథకం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఏమైనా ఇబ్బందులున్నాయా? అని నిర్మాణ ఎజెన్సీలను అడిగి తెల్సుకున్నారు. ఎజెన్సీలు తెలిపిన పలు అంశాలపై రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధకిరులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ మాసం నాటికి అన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యేలా నగరంలోని ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశం నుంచే ఫోన్‌లో మాట్లాడారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేసే ఎజెన్సీలకు ప్రోత్సాహాకాలను అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
అలాగే ఆలస్యం చేసే వర్కింగ్ ఎజెన్సీలకు జరిమానాలను సైతం విధించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణంలో పాటించాల్సిన నాణ్యత, సాంకేతికపరమైన అంశాలను కూడా మంత్రి సమావేశంలో సూచించారు. ఎజెన్సీలు ఇసుక కొరత అంశాన్ని ప్రస్తావించగా, టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలో నగరానికి నలువైపులా ఒక్కో ఇసుక డిపోను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతం నుంచి సీసీ కెమెరాల ద్వారా ఫీడ్ తీసుకుని కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాలన్నారు. ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా అధికారులు, వర్కింగ్ ఎజెన్సీల కోసం ఒక వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు.

చిత్రం..గురువారం జలమండలి కార్యాలయంలో అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి కేటీఆర్