తెలంగాణ

మార్చి 15 నుండి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: పదో తరగతి పరీక్షలను 2018 మార్చి 15వ తేదీ నుండి నిర్వహించనున్నట్టు తెలంగాణ పరీక్షల బోర్డు సంచాలకుడు బి సుధాకర్ తెలిపారు. రెగ్యులర్ పరీక్షలు ఉదయం 9.30కు ప్రారంభమై మధ్యాహ్నం 12.15 వరకూ జరుగుతాయి. ఒఎస్సెస్సీ పరీక్షలు మధ్యాహ్నం 12.45 వరకూ జరుగుతాయని, సమయ వేళలలను విద్యార్థులు చూసుకోవాలని చెప్పారు. అదే విధంగా తాము రాసే పేపర్ కోడ్‌ను చూసి జవాబులు రాయాలని, ఒక ప్రశ్న పత్రానికి బదులుమరో ప్రశ్నాపత్రం తీసుకుంటే దానికి విద్యార్థులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రధాన పరీక్షలు మార్చి 19 నుండి మొదలై మార్చి 31 వరకూ జరుగుతాయని ఆయన వివరించారు.
పరీక్షల షెడ్యూలు
మార్చి 15 ఒఎస్సెస్సీ పేపర్-1
మార్చి 16 ఒఎస్సెస్సీ పేపర్-2
మార్చి 17 వొకేషనల్ కోర్సు
మార్చి 19 ఫస్టు లాంగ్వేజి -1
కాంపొజిట్ కోర్సు-1
మార్చి 20 ఫస్టు లాంగ్వేజి-2
కాంపొజిట్ కోర్సు-2
మార్చి 21 సెకండ్ లాంగ్వేజి
మార్చి 22 ఇంగ్లీషు-1
మార్చి 23 ఇంగ్లీషు-2
మార్చి 24 మాథ్స్-1
మార్చి 26 మాథ్స్-2
మార్చి 27 సైన్స్-1
మార్చి 28 సైన్స్-2
మార్చి 29 ఎస్‌ఎస్-1
మార్చి 31 ఎస్‌ఎస్-2