తెలంగాణ

ఆహార భద్రత కోసం చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట, నవంబర్ 9: తెంలగాణ శాసనమండలిలో గురువారం ఉదయం ఆధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మద్య ప్రశ్నోత్తరాల పర్వం వాడి వేడిగా సాగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమధానాలిచ్చారు. ఆహార భద్రతకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో మొత్తం 30 ఫుడ్ ఇన్స్‌పెక్టర్లను నియమించిన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్మారెడ్డి తెలిపారు. సభలో అధికార పార్టీ సభ్యుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలోని వివిధ నగరాలలోని హోటళ్లు, రెస్టారెంట్ వంటి ఇతర ప్రాంతాల్లో కల్తీ ఆహార పదార్థల విక్రయాలు కొనసాగకుండా, ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహించేందుకు వీలుగా 30 మంది ఫుడ్ ఇనెస్పెక్టర్లను నియమించడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 20 మంది ఫుడ్ ఇనెస్పెక్టర్లు పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మరో పది మంది ఫుడ్ ఇనెస్పెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన్నట్లు మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం కింద అనేక రోగాలతో బాధపడుతున్న నిరుపేదలకు వైద్య చికిత్సలు అందిస్తున్నామని, వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులను సకాలంలో ఇస్తున్నామని ఈ విషయంలో ఏలాంటి జాప్యం లేదని మంత్రి లక్ష్మరెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పథకంకు సంబంధించి బిపిఎల్‌కు దిగువనున్న తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలు కల్పించాలని సభ్యులు ఫారుఖ్‌హుస్సేన్, ఏల్‌ఓపి మహ్మద్ అలీ షబ్బీర్‌లు ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో విజయ డెయిరీ తిరిగి ఆభివృద్ధి పథంలో నడుస్తుందని లేకుంటే మూతతపడేదని రాష్ట్ర పాడి పరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రోజు 50లక్షల లీటర్ల పాలు అవసరం ఉందని, రైతులకు ప్రభుత్వం లీటర్‌కు రూ.4 చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందించండం ప్రస్తుతం 4లక్షల 50వేల లీటర్ల పాలను రైతుల నుండి తెలంగాణ విజయ డెయిరీ సేకరిస్తుందన్నారు. దీంతో ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రూ87 కోట్లు నగదు ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. 4నెలల గడ్డు కాలంలో, మార్కెట్ డిమాండ్‌ను తట్టుకోవడానికి కర్నాటక పాల సమాఖ్య నుండి రోజుకు దాదాపు 30వేల లీటర్ల పాలను విజయ డెయిరీ కొనుగోలు చేసిందని చెప్పారు. తార్నాకలోని విజయ డెయిరీని ఆధునిక డెయిరీగా తీర్చిదిద్దుతమని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న నీటి పారుదల ప్రాజెక్టుల పనుల్లో ఆనేక అవక తవకలు జరుగుతున్నాయని, వీటిపై సమగ్ర ధార్యప్తు జరిపేందుకు గాను విజిలేన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.