తెలంగాణ

టెక్నాలజీతో ఉగ్రవాదాన్ని అణచివేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ఉగ్రవాదాన్ని టెక్నాలజీతోనే అణచివేశామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. పోలీస్ శాఖలో ప్రజల సహకారంతోనే తన సేవలు విజయవంతమయ్యాయని డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరుల ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు తనను ఎంతో ఆదరించారని, ఏ పండుగలైనా, ఎలాంటి వేడుకలైనా సామరస్యంగా జరుపుకుంటూ శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా సహకరించారన్నారు. పోలీస్ శాఖలో ఐపిఎస్ అధికారిగా తాను అందించిన సేవలు సంతృప్తినిచ్చాయని, పోలీస్ శాఖలో మంచి ఐపిఎస్ అధికారులున్నారని అన్నారు.
తనకు సహకరించిన అన్ని వర్గాల ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 12న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా డీజీపీ అనురాగ్ శర్మ మీడియాతో కాస్సేపు ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. ఐపిఎస్ అధికారిగా తన 30ఏళ్ల సర్వీసు సంతృప్తినిచ్చిందని, తెలంగాణ రాష్ట్రానికి తొలి డీజీపీగా మూడున్నరేళ్లు బాధ్యతలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుందనే వాదన తెరపైకి వచ్చిందని, అయితే సీఎం సహకారంతో ఆ సమస్యను అధిగమించామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
పోలీస్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని డీజీపీ పేర్కొన్నారు. తాను రిటైర్డ్ అయ్యాక ప్రభుత్వం కోరి, అవకాశమిస్తే ఎలాంటి సేవలందించేందుకైనా సిద్ధంగా ఉన్నానని డీజీపీ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు.