తెలంగాణ

సినిమాటోగ్రాఫర్ ప్రియన్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ప్రియన్ (53) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం చెన్నయ్‌లోని తన స్వగృహంలో ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో హాస్పిటల్‌కు తరలించగా ఆయన కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘సింగం’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రానికి వచ్చిన రెండు సీక్వెల్స్ కూడా తమిళంలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాని నమోదు చేసుకున్నాయి. ఈ సినిమాలు అంత సక్సెస్ సాధించడానికి ప్రధాన కారకుల్లో ప్రియన్ ఒకరు. తన సినీ కెరీర్‌లో ఎక్కువగా దర్శకుడు హరి తెరకెక్కించిన చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. హరితో కలిసి దాదాపు 13 చిత్రాలకు ప్రియన్ పనిచేశారు. ప్రియన్ తమిళనాడు విరుదున్‌నగర్‌లోని నాగేంద్రన్‌లో జన్మించారు. నటుడు, నిర్మాత కె.బాలాజీ యూనిట్‌లో అసిస్టెంట్ కెమెరామెన్‌గా పనిచేశారు. ప్రియన్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.