తెలంగాణ

నేతన్నలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: చేనేత , మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని, ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్‌లో 1270 కోట్ల రూపాయిలు కేటాయించిందని ఐటి మంత్రి కె తారకరామారావు చెప్పారు. చేనేత కార్మికులను ఆదుకున్న అంశంపై ఆయన గురువారం నాడు శాసనసభలో ఒక ప్రకటన చేశారు. ఆధునికతను అందిపుచ్చుకోవడంలో లోపంతో చేనేత రంగం తీవ్రంగా ప్రభావితం అయిందని అన్నారు. 16,879 చేనేత మగ్గాలు, 49,112 మరమగ్గాలతో పాటు ఈ రంగం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా అవసరమైన చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, బ్రాండ్ ప్రమోషన్ ఈ కేటాయింపుల ఉద్ధేశ్యమని అన్నారు. నేతన్నలకు థ్రిప్ట్ పథకం కింద నెలలో వచ్చిన కూలీలో 8 శాతం ఆదాచేస్తే ప్రభుత్వం నేడు మరో 16 శాతం నిధులను జమ చేస్తోందని, ఈ తరహా పథకం ఎక్కడా లేదని అన్నారు. మరమగ్గ కార్మికులతో పాటు అనుబంధ కార్మికులు కూడా ఈ పథకానికి అర్హుల్ని చేశామని అన్నారు. సొసైటీలు, కార్మికులు కొనుగోలుచేసే నూలు, సిల్క్, ఉన్ని, డై రసాయనాలపై ప్రభుత్వం 20 శాతం సబ్సిడీ ఇస్తోందని, దీనికి కేంద్రం 10 శాతం సబ్సిడీ అదనంగా ఇస్తోందని అన్నారు. అలాగే టిస్కొ ప్రస్తుతం 50 కోట్ల రూపాయిల విలువైన యూనిఫారాలను కొనుగోలు చేస్తోందని అన్నారు. చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు 127 కోట్ల రూపాయిలు, హస్తకళల అభివృద్ధికి ఇంకో 20 కోట్ల రూపాయిలను ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. దీంతో పాటు బ్రాండ్ ప్రమోషన్, మార్కెటింగ్ సదుపాయాలకు 11 కోట్ల రూపాయిలను కేటాయించామని అన్నారు. బతుకమ్మ చీరల కొనుగోలుకు 240 కోట్ల రూపాయిలను కేటాయించిందని చెప్పారు. జాతీయ చేనేత అభివృద్ధి పథకం కింద 8 బ్లాక్ లెవెల్ క్లస్టర్లు మంజూరయ్యాయని చెప్పారు. 14.98 కోట్లతో గద్వాల్‌లో కొత్తగా హ్యాండ్‌లూమ్ పార్కు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మరమగ్గాల కార్మికులను యజమానులుగా మార్చేందుకు సిరిసిల్లలో అపరల్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారని అన్నారు. వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తోందని ఆయన వెల్లడించారు. నేతన్నల రుణమాఫీ కోసం ప్రత్యేకంగా 15 కోట్ల రూపాయిలను కేటాయించామని అన్నారు.