తెలంగాణ

కొత్తగా తెలంగాణ వక్ఫ్ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: కేంద్ర వక్ఫ్ చట్టానికి అనుగుణంగా తెలంగాణ వక్ఫ్ చట్టాన్ని కొత్తగా రూపొందించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు అన్నింటినీ వెంటనే గుర్తించి, వాటిని పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వక్ఫ్ బోర్డు సభ్యులతో గురువారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వక్ఫ్ భూములకు ప్రహరీ/కంచెలు నిర్మించి కలెక్టర్లు తమ స్వాధీనంలో ఉంచుకోవాలని సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఎక్కడిక్కడ వక్ఫ్ భూములను గుర్తించి వాటి వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి ప్రస్తుతస్థితిపై వివరాలు సేకరించాలన్నారు. కబ్జాలకు గురైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై వ్యూహం ఖరారు చేయాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందన్నారు. వక్బ్ బోర్డుకు రెవిన్యూశాఖకు మధ్య వివాదాలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. వక్ఫ్ ఆస్తుల రక్షణకు రెండు కమిటీలు వేయాలని సూచించారు. ఒక కమిటీ రికార్డులను నిర్వహిస్తే, మరో కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్తులను గుర్తించాలన్నారు. వక్ఫ్ బోర్డు పనితీరు ఎలా ఉండాలి? విధి విధానాలు ఎలా ఉండాలి? అనే అంశాలపై స్పష్టత ఉండాలన్నారు. త్వరలో వక్ఫ్ బోర్డు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించుకుని భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంఐఎం శాసనసభా పక్షం నాయకుడు అక్బరుద్ధీన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, వక్ఫ్ బోర్డు చైర్మన్ సలీమ్ తదితరులు పాల్గొన్నారు.