తెలంగాణ

పెంపు తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచే అంశం కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉందని, ఈ వర్గాలకు రిజర్వేషన్ల పెంపును సాధించి తీరుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారిన సామాజిక పరిస్థితులు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని ఇప్పటికే ప్రధాన మంత్రిని కోరాగా సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి తెలిపారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లను పెంచుకోవడానికి తమకు అవకాశం ఇవ్వాలని సూచించానన్నారు. ఒకవేళ తమ ప్రతిపాదనకు కేంద్రం ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లి తమిళనాడుకు అవకాశం ఇచ్చినప్పుడు తమకు ఎందుకు ఇవ్వరని నిలదీస్తారన్నారు. మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచే అంశంపై పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో టిఆర్‌ఎస్ సభ్యులు కేంద్రంపై వత్తిడి తెస్తారన్నారు.
శాసనసభలో గురువారం మైనార్టీ సంక్షేమంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి సమాధానం ఇస్తూ మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించే అంశం ఒక తెలంగాణకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఇది దేశవ్యాప్త అంశమన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో మైనార్టీలకు రిజర్వేషన్లను సాధించి తీరుతామన్న పూర్తి విశ్వాసం తనకు ఉందన్నారు. ‘నాకు ఆత్మ విశ్వాసం మొదటి నుంచి ఎక్కువ, తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదన్నారు, అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి సాధించలేదా?’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మైనార్టీల సంక్షేమం పట్ల తమ చిత్తశుద్ధిని ప్రశ్నించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి రూ. 932 కోట్లు ఖర్చు పెడితే, తాము కేవలం మూడు సంవత్సరాలలో రూ. 2146 కోట్లు ఖర్చు చేసామంటే తమ చిత్తశుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం తమ ఈ మూడేళ్ల హయాంలో జరిగిందా? ఇంతకాలం అధికారంలో ఉన్న వారి హయాంలో జరిగిందా? చెప్పాలని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
మైనార్టీ కమిషన్, ఉర్దూ ఆకాడమీ, హాజ్ కమిటీలను నియమించకపోవడానికి ఇవన్నీ 9వ షెడ్యూల్ పరిధిలో ఉండటమే కారణమన్నారు. సమైక్య రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసారన్నారు. తెలంగాణ సంస్కృతి చాలా గొప్పదని, ఇక్కడ హిందూ ముస్లింల కలయికను గంగా జమున తౌసిబ్‌గా మహాత్మగాంధీ పోల్చారని సిఎం అన్నారు. తెలంగాణ దైవ భూమి అన్నారు. ఇక్కడ భద్రాచలం శ్రీరాముని గురించి సిపిఎం మాట్లాడుతుంది, ఇమామ్, వౌజంల గురించి బిజెపి అడుగుతుందని ఇంత గొప్ప సంస్కృతి మరెక్కడా లేదన్నారు. ఇక్కడ నాస్తికులు చాలా తక్కువని ఎక్కువ శాతం ఆస్తికులేనని ముఖ్యమంత్రి అన్నారు.