తెలంగాణ

చరిత్ర తిరగరాస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ చరిత్రను తిరగ రాస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. మైనారిటీ సంక్షేమంపై శాసనసభలో జరిగిన చర్చకు గురువారం సమాధానం ఇస్తూ, తెలంగాణకు గొప్ప చరిత్ర ఉందన్నారు. అన్ని మతాలు, కులాలవారు కలిసిమెలిసి జీవిస్తున్నారని, గత మూడేళ్లలో మతకలహాల జాడలేదని గుర్తు చేశారు. గతంలో రాజకీయాల లబ్దికోసం మతకలహాలు సృష్టించేవారని కెసిఆర్ ఆరోపించారు. నిజాం నవాబు సమాధి వద్దకు తాను వెళితే విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో అనేక దుర్మార్గాలు జరిగాయని, అయినా ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఆనకట్టను నిర్మించిన కాటన్‌దొరను ఉభయగోదావరి జిల్లాల ప్రజలు దేవుడిగా పూజిస్తున్నారని గుర్తు చేశారు. మరి నిజాంసాగర్‌ను నిర్మించిన నిజాంను విమర్శించడం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ‘నిమ్స్’ ఆసుపత్రిని నిర్మించింది నిజాం ప్రభువేనని గుర్తు చేశారు. భారత్-చైనా యుద్ధం జరిగిన సమయంలో ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ పిలుపు మేరకు నిజాం ప్రభువు ఆరు టన్నుల బంగారాన్ని దేశం కోసం బహుమతిగా ఇచ్చారని గుర్తు చేశారు. సమైక్యపాలనలో నిజాం పాలన, నిజాంప్రభువుపై బురద చల్లారని, తప్పుడు సమాచారంతో చరిత్ర రూపొందించారని కెసిఆర్ ఆరోపించారు. ఈ కారణంగానే తెలంగాణ చరిత్రను తిరగరాస్తామని, వాస్తవాలు ఏమిటో భవిష్యత్తు తరాలకు తెలియచేస్తామని కెసిఆర్ ప్రకటించారు.
*
దాశరథికి నాడేమో పిశాచమైనట్టి ప్రేతమిపుడెందులకో
ట్లాశావహుల నిజామై ఈ శాసక కర్తలనే కోశాన నిలిపి చరిత్ర గతి మార్చేనో!