తెలంగాణ

ధూపదీప నైవేద్యాలకు మార్గదర్శకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ దేవాలయాలకు ధూపదీప నైవేద్యం, అర్చకులకు గౌరవ వేతనానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన జీవోను బుధవారం జారీ చేసింది. దీనికి సంబంధించి నిర్దేశిత దరఖాస్తు ఫారంను కూడా జీవోకు జతపరిచారు.
తెలంగాణ చారిటబుల్ ట్రస్టు, హిందూమత సంస్ధల చట్టం 30/87 కింద దేవాలయాలను నమో దు చేసి ఉండాలి. 15 సంవత్సరాల క్రితం దేవాలయాన్ని నిర్మించి ఉండాలి. ఈ దేవాలయంలో భక్తులు నిత్య దర్శనం చేసుకుంటూ ఉండాలి. అర్చకుడు పూజాదికాలు నిర్వహిస్తూ ఉండాలి. ప్రాచీన దేవాలయాలకు ప్రాధాన్యత ఇస్తారు. దేవాలయం గ్రామం, మున్సిపాలిటీల పరిధిలో ఉండాలి. ఈ దేవాలయానికి ఎటువంటి ఆస్తులు ఉండరాదు. ఈ దేవాలయాలకు ఎటువంటి ఆదాయ వనరు ఉండకూడదు. కాని ధూపదీప నైవేద్యం స్కీం కింద ఒక దేవాలయానికి రెండున్నర ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల మెట్ట్భూమి ఉండి, సాలీనా ఆదా యం రూ.50 వేలు అన్ని రకాల వనరుల ద్వార వస్తున్నా కూడా ఆ దేవాలయాన్ని ఈ స్కీం కింద పరిగణిస్తారు. రెండేళ్లకోసారి జాతరలు జరిగే గ్రామ దేవతలకు ఈ స్కీం వర్తించదు.
గిరిజన ప్రాంతాల్లో నిత్యం పూజాదికాలు జరిగే దేవాలయాలను కూడా ధూపదీప నైవేద్య స్కీం కింద పరిగణిస్తారు. జాయింట్ కలెక్టరర్, జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, అర్చక సమాఖ్యకు చెందిన ఇద్దరు ప్రతినిధఉలు, శైవ శాక్తేయ, వైష్ణవ లేదా ప్రధాన అర్చకుడిని కమిటీలో నియమిస్తారు. ఈ కమిటీ వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత దేవాలయాలను సందర్శిస్తుం ది. మార్గదర్శకాలకు లోబడి దేవాలయాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కమిటీ పరిశీలిస్తుంది. డిజిటల్ ఫోటోగ్రాఫ్‌ను, అర్చకుడి ఫోటో గ్రాఫ్‌ను కమిటీ తీసుకుని ఈ సిడిని దేవాలయాల కంప్యూటీకరణ విభాగానికి అప్పగిస్తారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికను దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ స్క్రూటినీ చేసి నివేదికను రాష్ట్రప్రభఉత్వానికి ఇస్తారు. ప్రస్తుతం 1805 దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీం అమలవుతోంది. మరో మూడు వేల దేవాలయాలను ఈ స్కీం పరిధి కిందకు తీసుకురానున్నారు. తెలుగులో పొందుపరిచిన దేవాలయాల అర్చకుని వివరాలు, ఆధార్ నెంబర్‌ను పొందుపరచాలని జీవో కోరారు.