తెలంగాణ

మున్సిపల్ కౌన్సిలర్ల వేతనం పెంచుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పురపాలక, నగర పంచాయతీ కౌన్సిలర్ల గౌరవ వేతనం పెంచేందుకు కృషి చేస్తానని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చినట్లు తెలంగాణ మున్సిపల్, నగర పంచాయతి కౌన్సిలర్ల అసోసియేషన్ వెల్లడించింది. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు కెఎల్‌ఎన్ ప్రసాద్ తదితరులు మంత్రి కెటిఆర్‌ను గురువారం శాసనసభలో కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు. కౌన్సిలర్లకు కనీస వేతనం రూ.2500 నుంచి రూ.10 వేలకు పెంచాలని, హెల్త్‌కార్డులు, రెండు పడకల గదుల ఇళ్లు కేటాయించాలని కోరారు. పదవీ విరమణ తర్వాత కౌన్సిలర్లకు రూ.2 వేల పెన్షన్ సదుపాయాన్ని కల్పించడంతో పాటు నెలకు ఫోన్ బిల్లు కింద రూ.1000 చెల్లిచాలని, లాప్‌టాబ్‌లను మంజూరు చేయాలని వారు మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యలను విన్న మంత్రి కెటిఆర్ పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చిస్తానని, వేతనం పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.