తెలంగాణ

జైళ్ల సంస్కరణలు భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: తెలంగాణ జైళ్ల శాఖ ప్రవేశపెట్టిన నూతన సంస్కరణల అమలును పలువురు ప్రశంసించారు. గురువారం చంచల్‌గూడ జైలులో జైళ్ల సంస్కరణలు-అమలుపై జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ జైళ్లశాఖ ప్రవేశపెట్టి, అమలుపరుస్తోన్న సంస్కరణలను అధ్యయనం చేశారు. అమలు తీరును అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ, జైళ్లశాఖ నేర రహిత సమాజాన్ని కోరుకుంటోందని, ఖైదీలలో మంచి ప్రవర్తన తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ, జైళ్లలో నూతన సంస్కరణలు మంచి ఫలితాలనిస్తున్నాయని, పరివర్తన్ పథకం కింద ఎంతో మంది ఖైదీలు మారారన్నారు. ఖైదీలకు వృత్తి పరమైన శిక్షణ ఇస్తూ, వారికి ఉపాధి చూపే దిశగా చేపట్టిన ఈ బృహత్తర పథకంతో మహిళా ఖైదీలు ఉపాధి పొందారన్నారు.
ఖైదీలకు నాణ్యమైన భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఖైదీల కుటుంబీకులను, స్నేహితులను కలుసుకునేందుకు ప్రతి వారం ములాఖత్ పేరుతో అనుమతిస్తున్నామన్నారు. అదేవిధంగా బిచ్చగాళ్లు లేని నగరంగా మార్చేందుకు జైళ్లలో యాచకులకు పునరావాసం కల్పిస్తున్నామని హోంమంత్రి తెలిపారు. ఖైదీల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు జరుపుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కె దక్కుతుందన్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గింది. ఖైదీలలో మార్పు వచ్చింది.. విడుదలైన ఖైదీలకు జైళ్లశాఖ ఉపాధి చూపెట్టడం గర్వంగా ఉందన్నారు. జైళ్లశాఖ డీజీ వికె సింగ్ మాట్లాడుతూ, జైళ్లశాఖ ఆదాయ వనరులపై దృష్టి సారించిందని తెలిపారు. జైళ్లశాఖ అధ్వర్యంలో అనేక ఉత్పత్తులు జరుగుతున్నాయని, ఈ ఉత్పత్తులను ఎగ్జిబిషన్‌లలో అమ్ముతున్నామని తెలిపారు.