తెలంగాణ

మూడు చట్టసవరణ బిల్లులకు మండలిలో ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చాంద్రాయణగుట్ట, నవంబర్ 10: తెలంగాణ శాసన మండలి మూడు చట్ట సవరణ బిల్లులను అమోదించింది. గురువారం హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ప్రవేశపెట్టిన పీడీ యాక్టు పరిధిలోకి వచ్చే దోపిడీ, దొంగతనాలు, డ్రగ్స్ నేరాలు, గూండాల రౌడీయిజం, మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, ట్రాఫిక్ అఫెండర్స్, భూ కబ్జాదారులపై కఠినంగా వ్యవహరించే విధంగా ఉండే చట్టాన్ని మండలి అమోదించింది. హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి బిల్లును అమోదించడంతో అధికార, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ సభ్యులు తమ పూర్తి మద్దతు తెలిపారు. రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును శాసన మండలి అమోదించింది. పరిపాలన సౌలభ్యం కోసం, అభివృద్ధికి తగిన నిధుల సమీకరణకు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లును శాసన మండలి అమోదించింది. అదే విధంగా దుకాణాలు, వాణిజ్య సంస్థల ఏర్పాటుకు సవరించిన బిల్లును హోం, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు మండలి అమోదం తెలిపింది. ఈ బిల్లులు దుర్వినియోగం కాకుండా చూడాలని, బిల్లులను మరింత పటిష్టంగా చేసేందుకు సెలెక్ట్ కమిటీకి పంపించాలని షబ్బీర్ అలీ, పోంగులేటి డిమాండ్ చేశారు.