తెలంగాణ

తనిఖీలకు రేటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: ఇంటర్మీడియట్ విద్యను శాసిస్తన్న కార్పొరేట్ కాలేజీల ఎత్తులకు ప్రభుత్వం చిత్తవుతోంది. అధికారుల అవినీతి, ప్రభుత్వ చిత్తశుద్ధి లేమి కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు ఊతం ఇస్తోంది. జూనియర్ కాలేజీలను నిరంతరం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాల్సిన జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులు అందుకు భిన్నంగా రికార్డులను తమ కార్యాలయాల వద్దకే తెప్పించుకుంటూ రేటు ప్రకారం అనుమతులు ఇస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అనుబంధ గుర్తింపు, కళాశాల నిర్వహణ, పరీక్ష కేంద్రం కేటాయింపు, సిబ్బందికి పరీక్షల విధులు అప్పగింత, డిపార్టుమెంటల్ ఆఫీసర్ పోస్టు కేటాయింపు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ విధుల అప్పగింత వంటి అంశాల్లో జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారులే (గతంలో ఆర్‌ఐఓలు) కీలక నిర్ణేతలు , దాంతో పాటు కాలేజీల తనిఖీలు, వసతుల పరిశీలన, బోధన, బోధనేతర సిబ్బంది రికార్డుల తనిఖీ, విద్యార్థుల రికార్డుల తనిఖీలను సైతం వీరే చేస్తున్నారు. జిల్లా ఇంటర్ వొకేషనల్ విద్యాధికారులు, రీజనల్ ఇనస్పెక్టింగ్ అధికారులు ఉండటంతో కొన్ని బాధ్యతలను ఇరు అధికారులు పంచుకునేవారు, కాని నేడు రెండు వ్యవస్థలను రద్దు చేసి ఒకే వ్యవస్థ కింద జిల్లా ఇంటర్ విద్యాధికారులను నియమించిన తర్వాత వారి విధులు, బాధ్యతలు పెరిగాయి. జిల్లాల పునర్విభజన తర్వాత విస్తీర్ణం తగ్గినా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలోనే సగానికి పైగా కార్పొరేట్ కాలేజీలున్నాయి. వీటిలో సగం కాలేజీలకే గుర్తింపు ఉంది, మిగిలిన కాలేజీలు కోచింగ్ కేంద్రాలుగా ప్రకటించుకుంటున్నాయి. దాంతో అధికారులు ఆ కోచింగ్ కేంద్రాలను తనిఖీ చేసేందుకు అవసరమైన చట్టం రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడం యాజమాన్యాలకు కలిసి వచ్చింది. అనేక కార్పొరేట్ సంస్థలు వందల్లో కాలేజీలను నిర్వహిస్తున్నా వాటిలో కొన్నింటికి మాత్రమే అనుబంధ గుర్తింపును పొంది, మిగిలిన కాలేజీలకు ఎలాంటి గుర్తింపు తీసుకోకుండానే నిర్వహిస్తున్నాయి. అనుబంధ గుర్తింపు పొందడం వారికి ఆర్ధికపరమైన ఇబ్బంది లేకపోయినా, గుర్తింపు పొందిన నాటి నుండి అధికారుల ఒత్తిడి పెరుగుతుందని భావించి చట్టాన్ని తప్పించుకునేందుకు చిన్న చిన్న అపార్టుమెంట్లలో కోచింగ్ కేంద్రాల పేరుతో కాలేజీలను నిర్వహిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండటంతో , జిల్లా స్థాయిలో కొంత మంది నిజాయితీ అధికారులు ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. మరికొంత మంది అధికారులు దొరికిందే తడవగా, ఒక్కో అంశానికి ఒక్కో రేటు పెట్టి కార్పొరేట్ కాలేజీల నుండి డబ్బు గుంజుతున్నట్టు తెలిసింది.
వీడియో ఫుటేజ్‌లను చూపండి
అధికారులు కాలేజీలను తనిఖీ చేసినట్టు చెబుతున్న వీడియో ఫుటేజీలను బయటపెట్టాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఏ అధికారి ఏ కాలేజీకి వెళ్లి తనిఖీ చేశారో ఆ వీడియోలను బయటపెట్టాలని వివిధ సంఘాల నేతలు కోరుతున్నారు.
చట్టంలోనే లోపం
రాష్ట్రంలో కోచింగ్ కేంద్రాల నియంత్రణకు చట్టం లేకపోవడంతో డిగ్రీ కోర్సులను ఐఎఎస్ కోచింగ్‌ను కలిపి నిర్వహిస్తున్న కాలేజీలు పుట్టుకొచ్చాయి. కార్పొరేట్ జూనియర్ కాలేజీలు తరహాలో ఐఎఎస్ శిక్షణ కేంద్రాలు హైదరాబాద్‌లోనే 200 సంస్థలు వెలిశాయి. వీటికి ఎటువంటి నియమనిబంధనలు లేకపోవడం విడ్డూరం. ఆర్టీసీ ఎక్స్‌రోడ్‌లో ఒక శిక్షణ సంస్థలో ఏకకాలంలో 30వేల మంది శిక్షణ పొందుతున్నా, ఆ సంస్థపై ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేదు. అలాంటి సంస్థలు ఉండగా, ఐఐటి జెఇఇకి శిక్షణ ఇస్తే తప్పేమిటి అనే ప్రశ్నను జూనియర్ కాలేజీల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.