తెలంగాణ

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ఆరు కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు గాను ఆరు ప్రత్యేక కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆహ్వాన, సౌకర్యాలు, ఆహార, రవాణా, వేదికల నిర్వహణ, భద్రత కమిటీలను నియమిస్తూ శుక్రవారం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఆహ్వానకమిటీకి చైర్మన్‌గా హెచ్‌ఎండిఏ కమిషనర్, సౌకర్యాల కమిటీకి పర్యాటక అభివృద్ధి సంస్థ విసి ఎండి, ఆహార కమిటీకి పౌరసరఫరాల శాఖ కమిషనర్, రవాణా కమిటీకి రవాణా శాఖ కమిషనర్, వేదికల నిర్వహణ కమిటీకి జిహెచ్‌ఎంసి కమిషనర్, భద్రత కమిటీకి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్లను చైర్మన్లుగా నియమిస్తూ ప్రభుత్వం కమిటీలను నియమించింది. వీరందరికి సహాయంగా మరో ముగ్గురేసి సభ్యులను కూడా నియమించింది. ఈ కమిటీలను రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.