తెలంగాణ

ఆహార భద్రతా చట్టాన్ని నీరుకారుస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, నవంబర్ 10: పేదవాడికి పట్టడు అన్నం పెట్టే ఆహార భద్రతా చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుకారుస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో రూ.105కే 9 రకాల వస్తువులను అందించామని చెప్పారు. ప్రభుత్వ చర్యలతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేవలం ఒక్క రూపాయి నెపంతో వీటన్నింటిని అమలు చేయకుండా నిలిపివేశారని, ఈ పథకానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం లేదని దుయ్యబట్టారు.
మాటను నిలబెట్టుకోవాలి: చిన్నారెడ్డి
రాష్ట్ర ఏర్పాటు అనంతరం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సీనియారిటి ప్రకారం ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. గత 12 రోజులుగా ఐకేపీ ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోమటిరెడ్డి విమర్శించారు.
అధికారులను నియమించాలి
గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటును అందించే ఐటిడిఎలో అధికారులు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మొదట ఐటిడిఎకు ఓ ఐఎఎస్ అధికారిని నియమించి క్రింది స్థాయిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
చర్చలో పాల్గొనాలి
ప్రతిపక్షాలు సభలో రచ్చ చేయడం మాని చర్చలో పాల్గొనాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కోరారు. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరు విచిత్రంగా ఉందని అన్నారు.