తెలంగాణ

రైతులను ఆదుకోవడంలో తెరాస సర్కార్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యుడు రావుల ఆరోపించారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం నాడిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కనీసం పెట్టుబడి రాని పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 10 లక్షల ఎకరాల్లో దోమపోటు తెగులు ఆశించిందని స్వయంగా వ్యవసాయ అధికారులే వెల్లడించారని అన్నారు. చీడ పీడలను ఎదుర్కొనేందుకు మందులు పిచికారి చేసేందుకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైందని, అయినా పంట చేతికి అందని దుస్థితి నెలకొందని వివరించారు.