తెలంగాణ

ఉద్యోగులతో సమానంగా అర్చకులకు జీతభత్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆలయాల్లోని అర్చకులకు జీతభత్యాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు శాసనసభలో ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి , కల్లకుంట్ల విద్యాసాగరరావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ ప్రతి నెలా ఒకటో తేదీనే అర్చకులకు జీతభత్యాలు చెల్లిస్తామని అన్నారు. ధూప, దీప నైవేద్యం కింద 3వేల ఆలయాలకు నిధులు ఇస్తామని చెప్పారు. నెలకు ఒక్కంటికీ 2500 రూపాయిలు ఇచ్చేవారని, దానిని నేడు తాము ఆరు వేలకు పెంచామని వివరించారు. అందులో డిడిఎన్ నిమిత్తం రెండు వేలు, అర్చకుని వేతనం 4వేలు చెల్లించనున్నామని చెప్పారు. ఇందుకోసం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేశామని తెలిపారు. గతంలో సిజిఎఫ్ కింద ఆలయాలకు నిధులు ఇవ్వలేదని, కాని తాము మంజూరు చేశామని చెప్పారు. దేవాదాయ శాఖ భూముల సమస్యలపై చర్యలు వేగవంతం చేస్తామని అన్నారు. గుప్త నిధుల పేరిట ఆలయాలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయాలు, భూముల పరిరక్షణపై ఐదుగురు మంత్రులతో ప్రభుత్వం ఉపకమిటీని నియమించిందని , ఆ కమిటీ నివేదిక ప్రకారం అనేక చర్యలు చేపట్టామని వివరించారు.