తెలంగాణ

చకచకా చనాకా కొరాటా పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: చనాకా- కొరాటా బ్యారేజీ పనులను శరవేగంగా పూర్తి చేయనున్నామని సాగునీటి మంత్రి హరీష్‌రావు చెప్పారు. 2018 ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేసి సాగునీటిని అందిస్తామని ఆయన చెప్పారు. చనాకా -కొరాటా కింద 13,500 ఎకరాలకు, పెన్ గంగ ప్రాజెక్టు కింద 37,500 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించామని అన్నారు. చనాకా కొరాటా బ్యారేజీ, దిగువ పెన్‌గంగ ప్రాజెక్టుల కింద నియోజకవర్గాల వారీ చూస్తే బోధ్‌లో బీమ్‌పూర్ మండలంలో 11,103 ఏకరాలకు, ఆదిలాబాద్ జైనాద్ మండలంలో 23వేల ఎకరాలకు, ఆదిలాబాద్ రూరల్‌లో 2వేల ఏకరాలకు, బెలాలో 14,780 ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నామని, లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టును గత ప్రభుత్వాలు ఓట్ల కోసం వాడుకున్నాయని హరీష్‌రావు ఆరోపించారు. స్వయంగా తానే ఏడుసార్లు మహారాష్టక్రు వెళ్లి ప్రాజెక్టు పనులపై చర్చించి, అనుమతులు తీసుకున్నామని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో ఈ ప్రాజెక్టు కోసం అనేక మార్లు పోరాటం చేశామని, తన నేతృత్వంలో పనులు జరగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను పరిపుష్టం చేశామని ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. రాష్ట్రంలో సిజేరియన్ శస్త్ర చికిత్సల వల్ల ఆస్పత్రుల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదని అన్నారు. వారు ఆస్పత్రులకు వచ్చే సమయానికే రక్తస్రావంతో వస్తున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వాలు ఆస్పత్రులపై నిర్లక్ష్యం చేశాయని మండి పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులను నిర్లక్ష్యం చేసి ప్రైవేటు ఆస్పత్రులను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తూ నార్మల్ డెలివరీలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐఎంఆర్ 39 ఉంటే అది 28కి, ఎంఎంఆర్ 92 ఉంటే అది 70కి తగ్గిందని చెప్పారు. ప్రభుత్వ చర్యలతో ప్రసవ మరణాలు తగ్గాయని అన్నారు. ఆధునిక ఆస్పత్రులు, బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేశామని అన్నారు. కెసిఆర్ కిట్ల ద్వారా గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
రెండు మత్స్య కళాశాలలు
రాష్ట్రంలో రెండు మత్స్య కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు ఇచ్చామని పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. శాసనసభలో ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వనపర్తి జిల్లా పెబ్బేరులో, కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యాం వద్ద మత్స్య పరిశ్రమ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చేపల పెంపకంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. పెబ్బేరులో అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు జరుగుతాయని చెప్పారు. గంగపుత్రులు, ముదిరాజ్‌ల సంక్షేమం కోసం చేపల పెంపకం చేపట్టామని తెలిపారు. కుంటల చెరువులతో పాటు అన్ని రిజర్వాయిర్లలో 45 కోట్ల చేప పిల్లలను వదిలామని గుర్తుచేశారు. చేప పిల్లలను అందరికీ ఉచితంగా ఇచ్చామని తెలిపారు. నాగార్జున సాగర్, కోయిల్‌సాగర్, అల్లీసాగర్, సింగూరు, హుస్నాబాద్ వంటి ప్రాంతాల్లో కేజ్ కల్చర్ అమలుచేస్తున్నామని అన్నారు. ఈ ఏడాది రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టామని తెలిపారు. ముదిరాజ్, గంగపుత్రుల కుటుంబాలను ఆర్ధికంగా బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నామని అన్నారు.
జర్నలిస్టులకు బీమా
రాష్ట్రంలో రవాణా, రవాణేతర డ్రైవర్లకు, వర్కింగ్ జర్నలిస్టులకు, హోంగార్డులకు ఉచిత ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నామని హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి శాసనసభలో చెప్పారు. 14,11,514 మంది రవాణా , రవాణేతర ఆటోడ్రైవర్లకు, 20,230 మంది హోం గార్డులకు, 16,492 మంది వర్కింగ్ జర్నలిస్టులకు ఈ బీమా వర్తింపచేస్తున్నామని ఆయన వివరించారు.