తెలంగాణ

12 శాతం రిజర్వేషన్లు ఏమయ్యాయి సీఎం సారూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: ‘ముస్లింలకు తోఫాలు’ ప్రకటించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును రిజర్వేషన్లపై నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. తోఫాలతో ముస్లింలను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి వేస్తున్న ఎత్తుగడలను ఎండగట్టాలని టి.కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అయితే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటే తమకు అభ్యంతరం లేదు కానీ ఇచ్చిన మాటే ఏమైందని ముఖ్యమంత్రిని, మంత్రులను, అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని పార్టీ యంత్రాంగానికి నేతలు సూచించారు. టిఆర్‌ఎస్‌కు చేరువైన మజ్లిస్ విషయంలోనూ పార్టీ ఎటువంటి వైఖరి అనుసరించాలన్న అంశంపై సీనియర్ నాయకులతో మంతనాలు జరిపి నిర్ణయం తీసుకోవాలని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి భావిస్తున్నారు.
ఇలాఉండగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నా, అవరోధాల వల్ల 4 శాతమే అమలు చేయగలిగామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయంతో 10 లక్షల మంది పేద ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చినా, ఇంత వరకూ అంటే 40 నెలలు దాటినా ఒక్క ముస్లింకూ లాభం చేకూరలేదన్నారు. శాసనసభలో ముస్లింలకు తోఫాలు అంటూ ముఖ్యమంత్రి మరోసారి ముస్లింలను మోసగించేందుకు యత్నించారని ఆయన విమర్శించారు.
రిజర్వేషన్ల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారని, అవసరమైతే సుప్రీంకోర్టుకూ వెళతామని అన్నారని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ కట్టుకథలేనని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు హామీ ఇవ్వని మిషన్ భగరీథ పథకాన్ని పూర్తి చేయకపోతే ఎన్నికల్లో ఓట్లు అడగమని కెసిఆర్ అన్నారని ఆయన తెలిపారు. ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పే దమ్ము ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిసుస్తన్నదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అటువంటప్పుడు ప్రధాని మోదీ ఈ విషయంలో ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తారని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు బిసిల్లో ‘ఈ’ని జనాభా ప్రాతిపదికన పెంచితే, మిగిలిన ఎ,బి,సి,డి కూడా జనాభా ప్రాతిపదికన పెంచమంటే ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి మాటలతో జాప్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వక్ఫ్ బోర్డుకు జ్యూడిషియల్ అధికారం ఇస్తానని ఇప్పటి వరకు ప్రకటించలేదని అన్నారు.
టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన తర్వాత మైనారిటీ కమిషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ దేనికీ కమిటీ వేయలేదని, ముస్లింలకు లాభం చేకూర్చలేదని ఆయన విమర్శించారు. సుధీర్ కమిషన్ నివేదిక ఇచ్చి ఏడాది పూర్తయినా చర్యలు లేవన్నారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు 4 శాతం రిజర్వేషన్ల గురించి ప్రకటించిన 58 రోజుల్లోనే అమలు చేశామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి గుర్తు చేశారు. అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా శనివారం చార్మినార్ నుంచి గాంధీ భవన్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.