తెలంగాణ

నిజాంసాగర్ మూడు వరదగేట్ల ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, నవంబర్ 10: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లోకి భారీ సంఖ్యలో వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్ట్ రిజర్వాయర్‌కు ఉన్న 6,7,9వరద గేట్ల ద్వారా శుక్రవారం మధ్యాహ్నం 12.15నిముషాలకు నీటిని విడుదల చేశారు. బోధన్ నీటిపారుదల శాఖ ఇఇ మధుకర్‌రెడ్డి నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి 14,350క్యూసెక్కుల నీటిని దిగువ మంజీర ద్వారా గోదావరిలోకి విడుదల చేశారు. గేట్లను ఎత్తివేయడానికి ముందు ఇఇతో పాటు డిఇ దత్తత్రీ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరము గేట్లను ఎత్తినీటిని వదిలారు. గేట్లను వదలకంటే ముందు ప్రాజెక్ట్‌పై ఉన్న సైరన్‌ను దాదాపు గంటపాటు మో గించి, మంజీర పరీవాహక ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. నీటిని విడుదల చేస్తున్నట్లు సమాచారం తెల్సుకున్న నిజాంసాగర్ ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి సిబ్బందితో కలిసి ప్రాజెక్ట్ వద్ద భారీ బం దోబస్తు ఏర్పాటు చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయం పూర్తి స్థాయిలో నిండటంతో ప్రాజెక్ట్‌లో 17.802 టిఎంసిల నీరు నిలువ ఉంచుతూ అదనంగా వస్తున్న నీటిని వదిలిపెడ్తున్నారు.
ఎగువ ప్రాజెక్ట్ అయిన సంగారెడ్డి జిల్లా సింగూర్ ప్రాజెక్ట్ జలాశయం నుండి 19,500క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను సింగూర్ ప్రాజెక్టు 6,7గేట్ల ద్వారా విడుదల చేశారు. ఇంతే కాకుండా జలవిద్యుత్ కేంద్రం నుం డి 1460క్యూసెక్కులను విడుదల చేయడంతో మొత్తం 19,500క్యూసెక్కుల నీరు నిజాంసాగర్ రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. ఇంకా కూడా సింగూర్ ప్రాజెక్ట్ నుండి 15టిఎంసీల నీరు నిజాంసాగర్ జలాశయంలోకి వస్తాయని, అక్కడి నుండి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయంలోకి 10టిఎంసీల నీరు విడుదల చేయడం జరుగుతోందని అన్నారు.