తెలంగాణ

నిజాంను కీర్తించే పార్టీలను ఏం చేయాలో ప్రజలకు తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులని, నిజాంను కీర్తించే పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో ప్రజలకు బాగా తెలుసని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డిలు పేర్కొన్నారు. ఇద్దరూ వేర్వేరుగా పాత్రికేయులతో మాట్లడుతూ ఎంఐఎం చెప్పిందే టిఆర్‌ఎస్ చేస్తోందని, కెసిఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను తిరస్కరించి బిజెపిని సమర్ధించడం ఖాయమని అన్నారు.
కొన్ని రోజుల క్రితం వ్యంగ్యంగా మాట్లాడిన ఎంఐఎం పార్టీ నేతలు అసెంబ్లీలో మాత్రం టిఆర్‌ఎస్‌ను పొగడ్తలతో ముంచెత్తడం వెనుక క్విడ్ ప్రో కో జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రికి అధికారమే పరమావధిగా మారిందని ఆరోపించారు. టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా, కారు స్టీరింగ్ మాత్రం మా చేతుల్లో ఉందని చెప్పిన ఎంఐఎం నాయకుల వ్యాఖ్యలు నేడు ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచడం ద్వారా ఒకరికి అధికారం యావ, మరొకరికి అధికార పార్టీ అండ అనేది అర్ధమవుతోందని అన్నారు. నిజాం గొప్ప ప్రభువు అయి తే తెలంగాణ ఆడపడుచులను నగ్నం గా బతుకమ్మ ఆడించినందుకా అని ప్రశ్నించారు. నిజాం ధనవంతుడని కీర్తిస్తున్నారని , కాయకష్టం చేసుకునే రైతులను దోచుకున్నందుకా ఆయనను అలా కీర్తిస్తున్నారు అని ప్రశ్నించారు. 70వేల పుస్తకాలు చదివానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఓ నిజాంపిశాచమా? అని బొగ్గుతో జైలు గోడలపై దాశరథి రాసిన విషయం, బండెనక బండికట్టి అంటూ యాదగిరి పాడిన పాట, నిజాం ను వ్యతిరేకిస్తూ పాటలు రాసిన సుద్దాల హనుమంతు, ఇమ్రోజ్ పత్రిక అధినేత షోయిబుల్లా ఖాన్ లాంటి వారి చరిత్ర సిఎంకు తెలియదా అని ప్రశ్నించారు. ఇలాంటి పుస్తకాలను సిఎం చదవలేదా అని ప్రశ్నించారు.