తెలంగాణ

కొత్తగూడ అడవుల్లో పట్టుబడిన ఎన్‌డీ దళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 10: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గూడూరు, గంగారం, పాకాల అడవు ల్లో పోలీసులకు న్యూ డెమోక్రసీ దళ సభ్యులు పట్టుబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ పార్టీకి సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ (ఎన్‌డీ)దళ సభ్యులు కనిపించారు. న్యూడెమోక్రసీ సూర్యం దళం, కొత్తగూడ లక్ష్మిపురం గ్రామశివారులో మకాం వేసి రోడ్డు కాంట్రాక్టర్‌లను, మిషన్ కాకతీయ కాంట్రాక్టర్‌లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారం మేరకు పోలీస్ బలగాలు ఆ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహించి శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు తిరుగు ప్రయాణంలో లక్ష్మిపురం గ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పెద్దచంద్రన్న వర్గం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి సూర్యం, అతని వెంట గూడూరు, కొత్తగూడ దళ కమాండర్ జంపన్న, గంగారం దళ కమాండర్ ప్రదీప్ పోలీసులకు తారసపడినట్టు మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని చుట్టిముట్టి లొంగిపోవాలని కోరగా సోమభాస్కర్ అలియాస్ సూర్యం, మధు ఖానాపురం దళ సభ్యుడు వీరిద్దరూ పరారయ్యారు. పోలీసులకు పట్టుబడ్డ వారిలో న్యూడెమోక్రసీ కొత్తగూడ దళ కమాండర్ జక్కుల సమ్మయ్య అలియాస్ జంపన్న, గంగారం దళ కమాండర్ సోలం పాపారావు అలియాస్ ప్రదీప్, దళ సభ్యుడు దైదం క్రాంతికుమార్ అలియాస్ కెకె, బంగారి వినోద్ అలియాస్ సాంబారావు, మల్లమట్టి అశోక్, కొత్తగూడ దళ కమాండర్ మంగ్నురి కర్ణాకర్‌లు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. వీరి నుండి ఆరు ఆయుధాలు, ఆరు కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ ఎన్.కోటిరెడ్డి వెల్లడించారు. పోలీసులకు పట్టుబడ్డ ఆరుగురు దళ సభ్యులు అనేక కేసుల్లో నేరస్థులుగా ఉన్నారు. అంతేగాకుండా పలుమార్లు పోలీసులపై ఎదురుకాల్పులు జరిపిన సంఘటనలో కూడా నేరస్థులుగా ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు. సాయుధ దళ సభ్యులను పట్టుకోవడంలో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన కొత్తగూడ ఎస్సై సతీష్, గూడూరు సీఐ రమేష్‌లను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. తప్పించుకొని పారిపోయిన సోమ భాస్కర్ అలియాస్ సూర్యం, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి షేర్ మధులు తక్షణమే లొంగిపోవాలన్నారు. న్యూడెమోక్రసీ దళానికి అజ్ఞాతంలో ఉన్న న్యూడెమోక్రసీ దళ సభ్యులకు సహకరించేవారిని గుర్తించి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఎవరైనా మారణాయుధాలు ధరించి బలవంతపు వసూళ్లకు పాల్పడినా, బెదిరించినా అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

చిత్రాలు..వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి
*అరెస్ట్ అయిన దళ సభ్యులు