తెలంగాణ

హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ చార్జి చట్టవిరుద్దం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లలో సేవా రుసుము (సర్వీస్ చార్జి) బిల్లులో కలిపి వసూలు చేయడం చట్టవిరుద్దమని తూనికలు కొలతల శాఖ కంట్రోలర్ సివి ఆనంద్ తెలిపారు. చట్టవిరుద్దంగా ఎవరైనా వసూలు చేసినట్లు తెలిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పలువురు వినియోగదారుల నుంచి సేవా రుసుము వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. శనివారం నాడిక్కడ పౌరసరఫరాల శాఖ భవన్‌లో హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో కంట్రోలర్ సివి ఆనంద్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా సర్వీస్ చార్జీ వసూలు చేస్తున్నారని, ఈ పద్దతికి ఇకనైనా స్వస్తి పలకాలని అన్నారు. లేదంటే బలవంతంగా సర్వీసు చార్జీలు వసూలు చేస్తే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వినియోగదారుల చట్టాన్ని అనుసరించి సేవా రుసుము చెల్లింపు అనేది పూర్తిగా వినియోగదారుడిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. వినియోగదారుడికి అందించిన సేవల పట్ల సంతృప్తి చెందితే, అందుకు ఎంత అవసరమైతే అంతే వినియోగదారుడు చెల్లించేవిధంగా చట్టంలో పొందుపర్చబడి ఉందని తెలిపారు. బిల్లులో సేవా రుసుము అని ఉన్న ప్రదేశంలో ఖాళీగా ఉండాలని, అక్కడ వినియోగదారుడు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తారని, ఒక వేళ సేవలు సంతృప్తిగా లేవని భావించి చెల్లించకపోయినా డిమాండ్ చేసే హక్కు హోటల్ లేదా రెస్టారెంట్ యజమానికి లేదని అన్నారు. ఇఅక్రమ వ్యాపార పద్దతుల పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 13 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారని, ఇందుకు ప్రభుత్వం జివో కూడా జారీ చేసిందని సివి ఆనంద్ వివరించారు.