తెలంగాణ

హైదరాబాద్‌ను జల్లెడ పడుతున్న పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: ఈనెల 28 నుంచి 30వరకు హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక, ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో నగరవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ఈ సదస్సులో 180 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సౌత్‌జోన్ పోలీసులు పాతబస్తీతోపాటు నగరవ్యాప్తంగా రౌడీషీటర్లు, పాత నేరస్థుల కోసం జల్లెడ పడుతున్నారు.బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల, ప్రధాన కూడళ్లలో యాచిస్తున్న యాచకులను కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా నుంచి ప్రత్యేక భద్రతా సిబ్బంది ఫలక్‌నుమా చేరుకుంది. ఎస్‌పీజీ, ఐఎస్‌డబ్ల్యు, సిఎస్‌డబ్ల్యు బృందాలు రంగంలోకి దిగాయి. నగర ఇంటెలిజెన్స్ విభాగం, పెట్రోలింగ్ విభాగం దళాలు బందోబస్తు చర్యలు చేపట్టాయి. దక్షిణ మండల డిసిపి వి సత్యనారాయణ ఆధ్వర్యంలో 12మంది సిఐలు, 39మంది ఎస్‌ఐలు, 300 మంది సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.