తెలంగాణ

రిజర్వేషన్లు ప్రకటించారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 11: అధికారంలోకి రాగానే నాలుగు నెలల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇచ్చారా? అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ల హామీని ఇప్పుడు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చార్మినార్ నుంచి గాంధీ భవన్ వరకూ ఊరేగింపు నిర్వహించింది. ఈ ఊరేగింపులో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్‌సి కుంతియా కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగిస్తూ అధికారంలోకి రాగానే నాలుగు నెలలకే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి 44 నెలలైనా ఇంత వరకు రిజర్వేషన్లు అమలు చేయలేదని విమర్శించారు. ముస్లింలను రిజర్వేషన్ల పేరిట రాజకీయంగా ఉపయోగించుకోవడం తప్ప వారి సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచన చేయలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం రిజర్వేషన్లు ప్రకటించిన కేసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసగించారని విమర్శించారు. ఈ హామీని ఏమైనా కేంద్రాన్ని అడిగి ఇచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. మతోన్మాద శక్తులను గద్దె దించేందుకు యువత ముందుకు రావాలని, దేశ సమగ్రతను కాపాడుకోవాలని కుంతియా పిలుపునిచ్చారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్రంలో కేసిఆర్ అధికారంలోకి వచ్చేందుకు ముస్లిం, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడని కెసిఆర్ ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి తాను తప్పించుకోవడానికి కేంద్రంపైకి నెడుతున్నారని విమర్శించారు. కేవలం ముస్లింలను మభ్యపెట్టేందుకే ముఖ్యమంత్రి 12 శాతం రిజర్వేషన్ల గురించి నాటకం చేస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టిపరిస్థితుల్లోనూ మైనారిటీ రిజర్వేషన్లకు అంగీకరించరని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి కేసిఆర్‌కు మధ్య చీకటి ఒప్పందం ఏమైనా ఉందేమోనని, అందుకే కేంద్ర ప్రభుత్వానికి వివిధ అంశాలపై కేసిఆర్ మద్దతు ప్రకటించారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి గుర్తు చేశారు. రాష్టప్రతి అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ఎస్ భీజాలు ఉన్న వ్యక్తిని ఎన్డీఏ పోటీకి నిలబెట్టినప్పుడు కేసిఆర్ మద్దతునిచ్చారని ఉదహరించారు.
ర్యాలీకి విశేష స్పందన
ఇలాఉండగా శనివారం గాంధీ భవన్‌లో దేశ మొదటి విద్యా శాఖ మంత్రి వౌలనా అబుల్ కలాం అజాద్ 129వ జయంతిని జరుపుకున్నారు. అంతకు ముందు చార్మినార్ నుంచి గాంధీ భవన్ వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు.
చిత్రం..శనివారం చార్మినార్‌నుంచి గాంధీభవన్ వరకూ
నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు