తెలంగాణ

నానమ్మ బాటలో రాహుల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 11: అఖిల భారత జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిసెంబర్ 9న వరంగల్‌కు రానున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించే దళిత, గిరిజన, బీసీ గర్జన బహిరంగసభకు హాజరుకానున్నారు. ఏఐసీసీ అధినాయకురాలు సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే రాహుల్ వరంగల్ పర్యటన రెండుసార్లు వాయిదా పడింది. డిసెంబర్ తొమ్మిదిన కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేసిన రోజునే కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో పెద్ద ఎత్తున బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా డిసెంబర్ మొదటి వారంలోనే రాహుల్‌గాంధీని అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. గతంలో మాజీ ప్రధాని ఇంధిరాగాంధీ అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు.