తెలంగాణ

పత్తి రైతులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: పత్తి రైతులను ఆదుకోవాలని బిజెపి నాయకులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కోరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్‌రెడ్డి తదితర నాయకులు ఆదివారం పార్టీ కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్‌కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ ఏడాది 19,07,276 హెక్టార్లలో రైతు లు పత్తి పంట వేశారని వారు అందులో పేర్కొన్నారు. గత ఏడాది కంటే 5 లక్షల హెక్టార్లు ఎక్కువ అని వారు తెలిపారు. ఈ ఏడాది వర్షాభావంతో 186 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో పత్తి పంట బాగా దెబ్బతిన్నందున, రైతులకు ఇతోధికంగా సహాయం అందించాలని వారు కోరారు. అందుకు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ స్పంది స్తూ తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.