తెలంగాణ

14న బాలల దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: రాష్టస్థ్రాయి బాలల దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రభుత్వం నిర్వహిస్తోంది. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ అధీనంలోని ఇంటిగ్రెటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం (ఐసిపిఎస్) విభాగం నేతృత్వంలో బాలల దినోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్టస్థ్రాయి కార్యక్రమాన్ని రవీంద్రభారతిలో నిర్వహిస్తుండగా, జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో ప్రధానంగా పాఠశాలల్లో బాలలదినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. వ్యాసరచన, వక్తృత్వ, క్రీడాపోటీలు జరుగుతున్నాయి. బాలల హక్కులను కాపాడాలంటూ హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా నుండి రవీంద్రభారతి వరకు 14 న ఉదయం సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఆరోజు ఉదయం ఏడు గంటలకు పీపుల్స్ ప్లాజా చేరతారు. ఏడు గంటల నుండి ఏడున్నర వరకు సైకిళ్లను వరసల్లో నిలుపుతారు. 7.30 నుండి 8.00 గంటల మధ్య ముఖ్యఅతిథి, ఉన్నతాధికారులు వస్తారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బేటీ బచావో బేటీ పడావో’ పథకానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరిస్తారు. బెలూన్లను, గాలిపటాలను ఉద యం 8 గంటల నుండి 8.15 వరకు గాలిలోకి ఎగురవేస్తారు. 8.40-8.45 మధ్య సైకిల్‌ర్యాలీని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఈ ర్యాలీ రవీంద్రభారతి చేరుతుంది. ఆ తర్వాత ప్రధాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. భారతదేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినోత్సవమైన నవంబర్ 14 న దేశవ్యాప్తంగా బాలలదినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.