తెలంగాణ

కేరళ తరహాలో పంచాయతీరాజ్ చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: కేరళ తరహాలో పంచాయతీరాజ్ చట్టం చేయాలని సిపిఐ తెలంగా ణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కోరారు.
ఈ మేరకు చాడ ఆదివారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. తమ పార్టీ నిర్వహిస్తున్న పోరుబాట సందర్భంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు అప్పగించడం లేదన్న అంశాలు తమ దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల సర్పంచ్, మండల అధ్యక్షుడు పదవులకు ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రస్తుత పద్ధతి మంచిదేని, అయితే పరోక్ష ఎన్నికల పద్థతి నిర్వహించాలని వస్తున్న ప్రతిపాదన సరైంది కాదని ఆయన తెలిపారు.
దీని వల్ల క్యాంప్ రాజకీయాలు, ప్రజాప్రతినిధుల కొనుగోలు జరుగుతుందని పేర్కొన్నారు. ఇలాఉండగా సెర్ప్ హెచ్‌ఆర్ ఉద్యోగుల కాంట్రా క్టు సర్వీసులను క్రమబద్ధీకరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు.