తెలంగాణ

ఫీజుల బకాయిల కోసం 16న కలెక్టరేట్ల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: ఫీజుల బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచేందుకు ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తం గా కలెక్టరేట్లను ముట్టడించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణ య్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. బిసి విద్యార్థి సంఘం అధ్వర్యంలో ఆదివారం నగరంలో జరిగిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన ప్రసంగిస్తూ చదువుకునే విద్యార్థులకు ఫీజుల కోసం బడ్జెట్ కేటాయించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని విమర్శించారు. విద్యార్థులు చదువుతో పోరాడాలని, చదువుకై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. చట్ట సభల్లో బిసిలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.