తెలంగాణ

బ్యాంకులకు సర్కారు సలాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు నడిపించడంలో బ్యాంకులు సహకరించడం లేదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతోపాటు రాష్ట్ర మంత్రులు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారు. దాంతో భవిష్యత్తులో బ్యాంకుల ప్రమేయం ఏమీ లేకుండా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కొనసాగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాలతో పాటు ఇతర వర్గాల పేదల కోసం ప్రత్యేక కార్పోరేషన్లు ఏర్పాటు చేసి చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, టాక్సీలు, ఆటోల కొనుగోలు తదితర స్వయం ఉపాధిపనులకోసం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. కార్పోరేషన్ల ద్వారా ప్రభుత్వం స్వయం ఉపాధి యూనిట్ పెట్టుబడిలో యాభై శాతం, 75 శాతం (కులాలు, వర్గాన్ని బట్టి) సబ్సిడీగా ఇస్తోంది. ప్రభుత్వం వేర్వేరు పథకాలకు రెండు, మూడు లక్షల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుండగా, బ్యాంకులు మిగతా నిధులను రుణంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నాయి. రుణం ఇస్తామని సమావేశాల్లో ఇస్తున్న హామీ, క్షేత్రస్థాయిలో లబ్దిదారులను ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. రుణాలు ఇచ్చేందుకు తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ఇద్దరు గ్యారంటీ ఇవ్వాలని పేచీపెడుతున్నారు. పేదవర్గాల వారికి ఎవరూ గ్యారంటీ ఇచ్చేందుకు ముందుకురాకపోవడంతో పరిస్థితి జఠిలమవుతోంది. ఈ అంశంపై రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశాల్లో (ఎస్‌ఎల్‌బిసి) కూడా అనేక పర్యాయాలు చర్చ జరిగినా సత్ఫలితాలు రావడం లేదు. మంత్రులు, ముఖ్యమంత్రుల ముందు సమావేశాల్లో రుణాలు ఇస్తామని బ్యాంకు ఉన్నతాధికారులు హామీ ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బ్యాంకు శాఖల మేనేజర్లు, ఫీల్డ్ అఫీసర్లు విముఖత చూపిస్తున్నారు. దాంతో వివిధ కార్పోరేషన్లకు ప్రభుత్వం కేటాయిస్తున్న సబ్సిడీ నిధులు పూర్తిగా ఉపయోగపడటం లేదు. గత ఏడాది ఈ విధంగా ప్రభుత్వం వివిధ కార్పోరేషన్లకు కేటాయించిన దాదాపు 500 కోట్ల రూపాయలు ఉపయోగపడకుండా మిగిలిపోయాయి. అంతకు ముందు సంవత్సరాల్లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడ్డది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఈ అంశంలో పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. ఈ కారణాల వల్ల ప్రభుత్వం ఇక నుండి బ్యాంకుల ప్రమేయం లేకుండా రెండులక్షల రూపాయల వరకు ఇచ్చే సబ్సిడీని లబ్దిదారులకు నేరుగా ఇవ్వాలని భావిస్తోంది. లబ్దిదారులు స్వయం ఉపాధి కింద చేపట్టే యూనిట్ల వివరాలతో పాటు, సొంతంగా ఎంత భరిస్తారో వివరించాలని, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని లబ్దిదారుడికే నేరుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అయితే ఈ అంశంలో మంచి, చెడులను (మెరిట్స్, డీమెరిట్స్) పరిశీలించేందుకు అధికారులతో కమిటీ వేసి అధ్యయనం చేయాలని నిర్ణయించారు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు.