తెలంగాణ

ఈ నెలన్నర అత్యంత కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నెలన్నరపాటు అత్యంత కీలకంగా మారింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు, మెట్రోరైలు ప్రాజెక్టు ప్రారంభం, వచ్చే నెలలో ప్రపంచ తెలుగు మహాసభలు, డిసెంబర్ నెలాఖరుకు మిషన్ భగీరథ, భూ ప్రక్షాళన కార్యక్రమాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాకరమైన ఈ కార్యక్రమాలలో ప్రభుత్వం తలమునకలైంది. మరోవైపు శాసనసభ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ముఖ్యమైన బిల్లులను సభ ఆమోదించాల్సి ఉంది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ నెలన్నర వ్యవధిలో పూర్తి చేయాల్సిన కార్యక్రమాలలో తలమునకలై ఉండటంతో శాసనసభ సమావేశాలను మరో వారం రోజుల్లో ముగించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. శాసనసభ శీతాకాల సమావేశాలను 50 రోజలపాటు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ అనేక ముఖ్యమైన కార్యక్రమాలు ఈ నెలాన్నర వ్యవధిలోనే నిర్వహించాల్సి ఉండటంతో సమావేశాలను ముగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలాఖరున 28, 29, 30 మూడు రోజుల పాటు అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు హాజరుకాబోతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సును ప్రారంభించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎలాగు వస్తుండటంతో మెట్రోరైలు ప్రారంభోత్సవాన్ని కూడా ఆయన చేతుల మీదుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మెట్రోరైలును ప్రారంభించాల్సిందిగా ప్రధాన మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి మెట్రోరైలు ప్రారంభించే విషయంపై ఇంకా తమకు అధికారిక సమాచారం అందలేదని మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించినప్పటికీ, ఎలాగు ప్రధాని హైదరాబాద్‌కు వస్తుండటంతో ఎంతో ప్రతిష్టాకరమై ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి సుముఖత వ్యక్తం చేస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నెలాఖరున అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు, మెట్రోరైలు ప్రాజెక్టు ప్రారంభం ఈ రెండు ప్రభుత్వానికి ప్రతిష్టాకరమైనవే. అలాగే వచ్చే నెల డిసెంబర్ కూడా ప్రభుత్వం అత్యంత కీలకమైందే. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని డిసెంబర్ నెలాఖరు వరకు పూర్తి చేసి కొత్త సంవత్సర కానుకగా జనవరి ఒకటి నుంచి ఇంటింటికి మంచి నీటి అందించనున్నట్టు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే సెప్టెంబర్ 15 నుంచి రాష్టవ్య్రాప్తంగా భూ ప్రక్షాళన కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమం కూడా డిసెంబర్ నెలాఖరున ముగుస్తుందని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన, ప్రతిష్టాకరమైన కార్యక్రమాలన్నీ ఈ నెలన్నర వ్యవధిలోనే ఉండటంతో అధికార యంత్రాంగం వీటిలో తలమునకలైంది.