తెలంగాణ

మిగులు విద్యుత్ రహస్యమిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: మూడేళ్లలో ఎంత మార్పు. 2014లో తెలంగాణలో కరెంటు అస్తమానం పోయేది. కోతలతో పరిశ్రమలు తరలివెళ్లనున్నాయనే దుష్ప్రచారం జరిగింది. ఈ రోజు రెప్పపాటు కూడా కరెంటుపోకుండా ఒకవైపు వ్యవసాయానికి, మరోవైపు పారిశ్రామిక, గృహ వినియోగదారులకు తెలంగాణలో కరెంటు సరఫరా అవుతోంది. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వడమంటే ఆషామాషీ కాదు. మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రం మిగులు విద్యుత్ దిశగా అడుగులు వేయడం వెనక ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని విద్యుత్ నిపుణుల బృందం చేసిన కృషి ఆకట్టుకుంటోంది. ఒకానొక దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ అంశాల్లో పూర్తిగా సహకరించకపోయినా, మొక్కవోని విశ్వాసంతో తెలంగాణ ముందడుగు వేసింది. రూ.94 కోట్ల వ్యయంతో విద్యుత్ రంగం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నందువల్ల సత్ఫలితాలను అందిపుచ్చుకుంటోంది.
ఒక రాష్ట్రం ఆర్థిక ప్రగతికి సూచిక తలసరి విద్యుత్ వినియోగం. తెలంగాణ రాష్ట్రం తలసరి విద్యుత్ వినియోగంలో జాతీయ సగటును మించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం ఏడాదికి 1200 యూనిట్లుగా ఉంటే, ఇప్పుడు తలసరి విద్యుత్ వినియోగం 1505 యూనిట్లకు పెరిగింది. మూడున్నరేళ్లలో తెలంగాణ విద్యుత్ వినియోగం 26 శాతం పెరిగింది. దీనికి కారణం ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత, ముందస్తు ప్రణాళికలే కారణమని తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు చెప్పారు. 2016-17లో జాతీయ సగటు 1122 యూనిట్లయితే, తెలంగాణ సగటు అంతకన్నా 383 యూనిట్లు అదనంగా నమోదైంది. ఈ పెరుగుదల రాష్ట్ర పురోగతికి, మెరుగైన జీవన విధానానికి అద్దం పడుతుంది. విద్యుత్ సబ్సిడీలకు రూ.4777 కోట్లు కేటాయించి నిధులు విడుదల చేయడం వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి. డిస్కాంలపై ఆర్థిక భారం తొలగించేందుకు తెలంగాణ రాష్ట్రం ఉదయ్ పథకంలో చేరింది. డిస్కాంల కన్నా 8923 కోట్ల రుణభారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. దీని వల్ల డిస్కాంలు రుణ విమోచన పొంది, సమర్ధతతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 6574 మెగావాట్ల విద్యుత్ ఉండేది. దీంతో పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తారు. కాని మొదటి ఏడాదితోనే విద్యుత్ రంగం ముఖ చిత్రం మారింది. ప్రస్తుతం అదనంగా 7981 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చారు. సింగరేణి విద్యుత్ ప్లాంట్ ద్వారా 1200మెగావాట్లు, కెటిపిసి ద్వారా 600 మెగావాట్లు, జూరాల ద్వారా 240 మెగావాట్లు, కేంద్ర విద్యుత్ సంస్థల ద్వారా మరో రెండు వేల మెగావాట్లు సమకూర్చుకున్నారు. కొత్త సౌర విద్యుత్ విధానం వల్ల స్ధాపిత విద్యుత్ సామర్ధ్యం 14,555 మెగావాట్లకు పెరిగింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద తెలంగాణలో గరిష్ట స్ధాయిలో 2792 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. దీనికితోడు 13752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కొత్త ప్లాంట్ల నిర్మాణం పనులు చకాచకా సాగుతున్నాయి. వచ్చే ఏడాది కొత్తగూడెం వద్ద నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ ద్వారా 1880 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తోంది. రామగుండం ఎన్టీపిసి విద్యుత్ ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ రెండేళ్లలో లభించనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్తర, దక్షిణ గ్రిడ్‌ల మధ్య కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని చేపట్టిన పూర్తి చేశారు. దేశంలో ఎక్కడి నుంచి అయినా రెండు వేల మెగావాట్ల విద్యుత్ పొందేందుకు వీలుగా పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో తెలంగాణ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది.