తెలంగాణ

గోదాములకు రూ.1024 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: రాష్ట్రంలో గోదాముల నిర్మాణానికి 1024 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు మార్కెటింగ్ మంత్రి హరీష్‌రావు చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఆరూరి రమేష్ , పువ్వాడ అజయ్‌కుమార్‌లో అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ గిడ్డంగుల నిల్వ సామర్ధ్యం పెంచామని అన్నారు. గోదాముల సామర్ధ్యం 22.2 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని అన్నారు. మూడు లక్షల మెట్రిక్ టను,నల గోదాములను పౌరసరఫరాల శాఖ, హాకాకు అప్పగించామని చెప్పారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా గోడౌన్లు ఇస్తున్నామని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ గోడౌన్లను ఖాళీగా ఉంచి, ప్రైవేటు గోడౌన్లను ప్రోత్సహించిందని, కాని తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ గోడౌన్లను నింపిన తర్వాతనే ప్రైవేటు గోడౌన్లలో ఉంచేందుకు అనుమతిస్తామని అన్నారు. ఇందుకు ఒక నోడల్ ఏజన్సీని కూడా నియమించామని చెప్పారు. రైతుబంధు పథకం కింద 1651 మంది రైతులకు 20 కోట్ల రూపాయిలు కేటాయించామని అన్నారు. ఖమ్మంలో పండ్ల మార్కెట్‌కు స్థలం ఇస్తే గోదాము నిర్మాణం గురించి ఆలోచిస్తామని మంత్రి చెప్పారు. 150కోట్లతో కొత్తగా గోడౌన్లను నిర్మించామని తెలిపారు. పారదర్శకంగా టెండర్ల నిర్వహణతో 150 కోట్లు ఆదా అయ్యాయని మంత్రి హరీష్‌రావు చెప్పారు. గోదాముల నిర్మాణానికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద 221.22 కోట్లు మొత్తం గ్రాంట్‌గా దక్కిందని అన్నారు.